Truecaller: ట్రూకాలర్ ఇండియా కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు

by S Gopi |   ( Updated:2024-11-07 15:28:02.0  )
Truecaller: ట్రూకాలర్ ఇండియా కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం ప్రముఖ కాలర్ ఐడీ ప్లాట్‌ఫామ్ ట్రూకాలర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. కంపెనీ యాజమాన్యం అధికారులకు సహకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్(టీపీ), సహా పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించడం, పత్రాలను తనిఖీ చేయడం కోసం సోదాలు చేసినట్టు పన్ను అధికారులు వెల్లడించారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్‌లలోని ట్రూకాలర్ కార్యాలయాల్లో తనిఖీలు జరిగినట్టు సమాచారం. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా తమ కార్యకలాపాలు పూర్తి పారదర్శకంగా ఉన్నాయని ట్రూకాలర్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. భారత చట్టాల ప్రకారం తమ ఆఫీసులు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన అన్ని పన్నులను చెల్లిస్తోందని స్పష్టం చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, అంతర్జాతీయంగా ట్రూకాలర్‌కు 42.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed