- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇష్టం లేని వివాహం.. భార్యను ఎలా చంపేశాడో చూడండి!

దిశ, నారాయణపేటకు క్రైం: కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిస్పీ లింగయ్య తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నారాయణపేట పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్యానాయక్ తండాకు చెందిన వినోద్ నాయక్ కు తన మేనమామ కూతురు అయిన శారు రాథోడ్ తో గత జనవరి నెలలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కానీ వినోద్ నాయక్ శారు రాథోడ్ తో పెళ్లి ఇష్టం లేకపోవడంతో..కొద్దిరోజులుగా భార్యభర్తలిద్దరూ దూరంగా ఉంటున్నారు. మరొక వివాహం చేసుకోవాలనే దురాలోచనతో శారు రాథోడ్ ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడని డీఎస్పీ తెలిపారు. దీంతో వినోద్ నాయక్ తన భార్య శారు రాథోడ్తో ఎలాంటి కారణం లేకుండా గొడవ పెట్టుకొని, ఆమెను కొట్టాడన్నారు.
శారు రాథోడ్ తల్లిదండ్రులు వచ్చి ఎందుకు గొడవ పడ్డారని ప్రశ్నించగా.. వినోద్ నాయక్ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళి అదే రోజు రాత్రి తన భార్యను చంపాలనే ఉద్దేశ్యంతో మళ్ళి గొడవ పెట్టుకొని గొంతు నులిమి హత్య చేశాడన్నారు. హత్య చేసి ఉరి వేసుకున్నట్టుగా కుట్ర పన్నాడని డిఎస్పి వివరించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వినోద్ నాయక్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు. కేసును చేదించడంలో కృషి చేసిన మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు.