- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Tummala:జిన్నింగ్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేయాలి.. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
దిశ, తెలంగాణ బ్యూరో: జిన్నింగ్ మిల్లులను జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలన్నారు. సచివాలయంలో గురువారం అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్, జౌళి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోళ్ల పై కార్యకలాపాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో మేజర్ మార్కెట్ కమిటీలను ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల పై సమగ్ర వివరాలు అందించేలా ఒక వెబ్ పోర్టల్ తయారు చేశామని, దీంతో సీసీఐ ఇప్పటి వరకు ఎంత పత్తిని కొనుగోలు చేశారో, ఎంత పత్తిని రిజెక్ట్ చేశారో అన్ని కూడా ఇందులో పొందుపర్చారన్నారు.
మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులు జిన్నింగ్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేసి, రిపోర్టును డైరెక్టర్ మార్కెటింగ్ శాఖ వారికి అందించాలని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శితో మాట్లాడి వరి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని సూచించారు. మార్కెటింగ్ సెంటర్లలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని దగ్గరలోని సీసీఐ సెంటర్లలోనే పత్తిని అమ్ముకోవాలని రైతులను కోరారు. రైతులు పత్తిలో తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉంటే అధిక మద్దతు ధరను పొందవచ్చని, అలాగే పత్తి అమ్ముకోవడం లో ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ చాట్ యాప్ 8897281111తో తెలపాలన్నారు.