రోగనిరోధక శక్తి స్థాయిలను కొలిచే కొత్త పరికరం

by sudharani |   ( Updated:2022-08-10 09:39:46.0  )
రోగనిరోధక శక్తి స్థాయిలను కొలిచే కొత్త పరికరం
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ ఇన్‌ఫెక్షన్ తర్వాత సదరు వ్యక్తి రక్త నమూనాల్లో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ స్థాయిలను కొలవడం ద్వారా అతడి రోగనిరోధక శక్తిని లెక్కించవచ్చు. కానీ ఇందుకోసం ప్రత్యేకమైన ల్యాబ్ పరికరాలు అవసరం. అయితే ఈ పరీక్షను ఇంటి దగ్గరే సులభంగా చేసుకునేవిధంగా MIT పరిశోధకుల బృందం ఓ ర్యాపిడ్ కిట్‌ను అభివృద్ధి చేసింది.

పరిశోధకులు రూపొందించిన పరికరంతో కొవిడ్ యాంటీబాడీస్ స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాపిడ్ యాంటిజెన్ కొవిడ్ పరీక్షల మాదిరిగా కాకుండా ఈ కొత్త యాంటీబాడీ పరీక్షకు రక్త నమూనా అవసరం అవుతుంది. ఈ మేరకు ఆ పరికరంలో ఒక చుక్క రక్తాన్ని డ్రాప్ చేయగానే.. అందులోని న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్(తటస్థీ్కరణ ప్రతిరోధకాలు)ను ట్రాక్ చేసి, కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు వారి ససెప్టబిలిటీ(గ్రహణశీలత)ని అంచనా వేస్తుంది.

ఒక చుక్క రక్తాన్ని సేకరించేందుకు గాను ఈ ప్రోటోటైప్ టెస్ట్ కిట్‌లో ఫింగర్-ప్రిక్ పరికరం వస్తుంది. ఆ తర్వాత ఇది స్పెసిఫిక్ రియేజెంట్స్ కలిగిన డ్రాపర్‌కు బదిలీ చేయబడుతుంది. ఈ రీయేజెంట్స్ మైక్రోస్కోపిక్ గోల్డ్ పార్టికల్స్‌తో ట్యాగ్ చేసిన SARS-CoV-2 వైరల్ ప్రోటీన్స్‌ను కలిగి ఉంటాయి. ఈ మేరకు రక్త నమూనాలోని ప్రతిరోధకాలు ఈ గోల్డ్-ట్యాగ్ చేసిన వైరల్ ప్రోటీన్స్‌తో ఇంటరాక్ట్ చెందుతాయి. అప్పుడు ఈ మిక్స్‌డ్ శాంపిల్ చుక్కలను టెస్ట్ స్ట్రిప్‌పై ఉంచితే యాంటీబాడీస్ ద్వారా సంగ్రహించిన ప్రోటీన్లు పాజిటివ్ లైన్‌ను చూపిస్తాయి. అంతేకాదు స్మార్ట్‌ఫోన్ యాప్‌ సాయంతో పరిశోధకులు పాజిటివ్ లైన్ తీవ్రతను కొలవడం ద్వారా యాంటీబాడీ స్థాయిలను లెక్కిస్తారు.


వ్యాక్సిన్ లేదా సహజ ఇన్‌ఫెక్షన్ తర్వాత నెలల్లోనే యాంటీబాడీ రియాక్షన్స్ వేగంగా పడిపోతాయి. ఈ దృక్కోణం నుంచి చూసినప్పుడు ఈ కొత్త కిట్ పర్టిక్యులర్ సందర్భాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. కాగా కీమోథెరపీ పేషెంట్స్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నవారిలో రోగనిరోధక ప్రతిస్పందనలను ట్రాక్ చేయడమే దీని ప్రాథమిక ఉపయోగ లక్ష్యమని ప్రాజెక్ట్‌ ప్రధాన పరిశోధకుల్లో ఒకరైన హోజున్ లి చెప్పారు.

ప‌డ‌కమీద‌ స్త్రీలకు మూడు రకాల భావప్రాప్తి.. ఎలా వ‌స్తుందో తెలుసా..?!

కామారెడ్డి జిల్లా ఆకాశంలో అద్భుతం.. మూడు రంగుల్లో సూర్యుడు


Advertisement

Next Story

Most Viewed