గర్భస్రావాలకు ముఖ్య కారణమిదే.. గుర్తిస్తే జాగ్రత్తపడొచ్చు..

by Prasanna |   ( Updated:2023-03-27 14:16:51.0  )
గర్భస్రావాలకు ముఖ్య కారణమిదే.. గుర్తిస్తే జాగ్రత్తపడొచ్చు..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా సగానికిపైగా ప్రెగ్నెన్సీలు గర్భస్రావంతో ముగుస్తున్నాయి. చాలా మంది స్త్రీలు తాము గర్భవతి అని గ్రహించే లోపే జరగరానిది జరిగిపోతోంది. ఈ విషయంపై అధ్యయనం చేసిన నెదర్లాండ్స్‌ రోటర్‌డ్యామ్‌లోని ఎరాస్మస్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు.. గర్భంలో పిండం నెమ్మదిగా అభివృద్ధి చెందడమే ఇందుకు కారణమని నిర్ధారించారు. ఎంబ్రియోస్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన 3డి ఇమేజెస్ బిల్డ్ చేసేందుకు వెజినల్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ వినియోగించిన వారు.. వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్స్ ధరించి విజువల్ ఇన్‌స్పెక్ట్ చేశారు. కాగా గర్భం ప్రారంభంలోనే మిస్‌క్యారేజ్ గురించి అంచనా వేయడానికి ఈ అన్వేషణ ఒక ముందడుగు లాంటిదని అంటున్నారు నిపుణులు.

ఇలా 644 మంది గర్భిణీ స్త్రీల కడుపులోని పిండాల చిత్రాలను రూపొందించిన శాస్త్రవేత్తలు.. వీరిలో 33 మంది గర్భస్రావానికి గురైనట్లు గుర్తించారు. గర్భం దాల్చిన తర్వాత దాదాపు ఎనిమిది వారాలలో ఉత్పత్తి చేయబడిన 3D చిత్రాలను చూసినప్పుడు.. చివరికి మిస్‌క్యారేజ్ అయిన పిండాలు చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాయని గమనించారు. పిండం పరిపక్వత అనేది కార్నెగీ స్టేజింగ్ సిస్టమ్ అని పిలవబడే విధానం ద్వారా అంచనా వేయబడింది. ఇది 23-దశల స్కేల్ ప్రకారం లింబ్ బడ్స్, ప్రారంభ ముఖ లక్షణాలు వంటి భౌతిక లక్షణాల అభివృద్ధిని సూచిస్తుంది. ఒకవేళ కార్నెగీ దశ ఆలస్యమైతే మహిళ గర్భస్రావం అయ్యే అవకాశం 1.5 శాతం పెరిగిందని వివరించారు. గర్భం దాల్చిన ఎనిమిది వారాలలో పిండం అభివృద్ధిలో నాలుగు రోజులు ఆలస్యమయినట్లయితే.. గర్భస్రావం జరుగుతుందనే విషయంపై వైద్యులు సలహా ఇవ్వచ్చన్నారు.

Also Read...

రేపు రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ సమయంలో ఒకే చోట కనిపించనున్న 5 గ్రహాలు

Advertisement

Next Story