- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిక మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్ కలిగిన ఆహారాలు.. లిస్ట్‌లో మీరు రోజూ తినే...
దిశ, ఫీచర్స్ : మైక్రోప్లాస్టిక్స్ మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. ఇప్పటికే బ్లడ్, బ్రెయిన్, హార్ట్, ఊపిరితిత్తులు, కాలేయంలోకి చేరినట్లు తేలగా... చివరికి తల్లిపాలలోనూ ఉన్నాయని గుర్తించారు. ఇవి ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుండగా.. మనం తీసుకునే ఏ ఫుడ్ లో ఇవి అధికంగా ఉంటున్నాయో తెలిపారు నిపుణులు.
అన్నం
మన ఆహారంలో బియ్యం ప్రధానమైంది. కాగా యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ అధ్యయనం ప్రకారం... మనం తీసుకునే ప్రతి అరకప్పు బియ్యంలో నాలుగు మి.గ్రా. మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. అంటే బియ్యం ఈ ప్రమాదాన్ని అధికంగా పెంచుతున్నట్లు తెలుస్తుండగా.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు బియ్యం ఎక్కువసార్లు కడగడం మంచిదని సూచిస్తున్నారు.
ఉప్పు, చక్కెర
చక్కెర, ఉప్పు ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాక్ చేయడం సాధారణం కాబట్టి మైక్రో ప్లాస్టిక్ ఈజీగా వీటిలోకి చేరే అవకాశం ఉంది. పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ చేసిన 'మైక్రోప్లాస్టిక్స్ ఇన్సాల్ట్ అండ్ షుగర్' అనే పేరుతో ఒక అధ్యయనం.. ఆన్‌లైన్, స్థానిక మార్కెట్ల నుంచి కొనుగోలు చేసిన ఐదు రకాల చక్కెర, టేబుల్ ఉప్పు, రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పుతో సహా 10 రకాల ఉప్పును పరీక్షించింది. వీటిలో 0.1 మిమీ నుంచి 5 మిమీ వరకు వివిధ రూపాల్లో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొంది. 2023లో జరిపిన మరో అధ్యయనంలో భూమి నుంచి తవ్విన హిమాలయన్ గులాబీ ఉప్పులో అత్యధిక మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని... ఆ తర్వాత బ్లాక్ సాల్ట్ , మెరైన్ సాల్ట్ లోనూ ఉన్నాయని గుర్తించారు.
టీ బ్యాగ్స్
మానవ శరీరాన్ని మైక్రోప్లాస్టిక్‌లకు ఎక్స్ పోజ్ చేసే మరో ప్రమాదకర వస్తువు టీ బ్యాగ్. వీటిలోని ప్లాస్టిక్‌లు ప్రకృతిలో కుళ్ళిపోవడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. ఇక వీటి పరిమాణం 1 µm నుంచి 5 mm మధ్య ఉండవచ్చు. టీ బ్యాగ్‌లను వేడి నీటిలో ముంచినప్పుడు.. నీటి అధిక ఉష్ణోగ్రత హానికరమైన పదార్థాల విడుదలకు దారితీయవచ్చు. కాగా టీ ప్రేమికులు ఈ విషయంలోజాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు, ఎందుకంటే వారు బిలియన్ల కొద్దీ ప్లాస్టిక్ కణాలకు ఎక్స్ పోజ్ అవొచ్చు. మానవ కణాలలోకి చొరబడవచ్చు.
బాటిల్ వాటర్
మీ త్రాగునీరు 2,40,000 ప్లాస్టిక్ శకలాలను నిల్వ చేయగలదని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ సింగిల్ యూజ్ వాటర్ బాటిళ్లలో వేలకొద్దీ చిన్న చిన్న ప్లాస్టిక్‌లను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన ఇమేజింగ్ టెక్నిక్ ఉపయోగించబడింది. ఈ చిన్న ప్లాస్టిక్ బిట్‌లలో 90 శాతం నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని అధ్యయనం కనుగొంది, ఇవి మానవ కణాలు, కణజాలంలోకి శోషించబడతాయి. బాటిల్ మూత తెరిచి పెట్టిన ప్రతిసారీ.. అధిక సంఖ్యలో మైక్రోప్లాస్టిక్‌లు నీటిలోకి ప్రవేశిస్తాయి.
సీఫుడ్
సీఫుడ్ ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. కాగా సముద్రంలోకి మురుగునీటి ద్వారా ప్రయాణించే మైక్రో ప్లాస్టిక్ సముద్ర జంతువులచే వినియోగించబడుతుంది. ఈ జంతువులలో పేరుకుపోయిన మైక్రోప్లాస్టిక్‌లు.. వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. వివిధ రకాల సీఫుడ్‌లలో మైక్రోప్లాస్టిక్స్‌పై జరిపిన 2020 అధ్యయనం ప్రతి నమూనాలో ప్లాస్టిక్‌ను కనుగొంది.
Read More...