- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారం పట్ల ఆసక్తి ఉంటే వందేళ్లు బతకొచ్చు.. లేదంటే..
దిశ, ఫీచర్స్: శృంగారం పట్ల ఆసక్తి ఉన్న పురుషులు సెక్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని తెలిపింది జపాన్ అధ్యయనం. యమగత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తొమ్మిదేళ్లపాటు జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. 40ఏళ్లు పైబడిన 21వేల మంది పురుషులు, మహిళలు పాల్గొన్న ఈ స్టడీలో మెడికల్ హిస్టరీ, స్ట్రెస్ లెవల్స్‌ను కూడా పరిశీలించారు.
8500 కంటే ఎక్కువ మంది పురుషులు పాల్గొన్న అధ్యయనంలో 8.3 శాతం మందికి స్త్రీల పట్ల ఆసక్తి లేదు. దాదాపు 12,400 మంది మహిళల్లో 16.1 శాతం మందికి వ్యతిరేక లింగంపై ఇంట్రెస్ట్ లేదు. ఈ తొమ్మిదేళ్లలో 356 మంది మగవారు, 147 మంది ఆడవాళ్లు మరణించగా.. అపోజిట్ జెండర్ పట్ల ఇంట్రెస్ట్ లేని పురుషులు 9.6 శాతం మంది చనిపోతే, మహిళల పట్ల ఆసక్తి ఉందని చెప్పిన వారిలో కేవలం 5.6 శాతం మంది మాత్రమే మరణించారు. ఇక సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేని వారిలో ధూమపానం, మద్యపానం, మానసిక అనారోగ్యం, అరుదుగా నవ్వడం, తక్కువ విద్యార్హత ఉన్నవారు ఎక్కువ శాతం ఉన్నారు. క్యాన్సర్ మరణాల బారిన పడే ప్రమాదం కలిగి ఉన్నారు. అయితే సెక్స్ పట్ల ఆసక్తి మరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ఇంకా అధ్యయనాలు జరగాల్సి ఉంది. ఇక మహిళల విషయానికి వస్తే సెక్స్-మరణం పట్ల మధ్య సంబంధాన్ని కనుగొనడంలో అధ్యయనం విఫలమైంది.
ఇవి కూడా చదవండి: తరచూ తలనొప్పి వేధిస్తోందా? .. బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు..