- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారానికి కూడా షెడ్యూల్ ఫిక్స్ చేయాలా..?
దిశ, వెబ్ డెస్క్ : మన నిత్య జీవితంలో ఏమైనా పనులు చేయాలంటే టైం ఫాలో అవుతాం. అలాగే షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకుంటాం. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేసుకుంటాం. అలాగే పెళ్లైన దంపతులు సెక్స్ చేయడానికి కూడా షెడ్యూల్ పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. కొంత మందికి తన జీవిత భాగస్వామితో కలవడానికి అస్సలు సమయం ఉండదు అలాంటి వారు ఇలా షెడ్యూల్ చేసుకుంటే వారి కాపురం బాగుంటుందని నిపుణుల అభిప్రాయం. కొంత మందికి పిల్లలు పుట్టిన తర్వాత సమయం దొరకదు కాబట్టే షెడ్యూల్ చేసుకోవాట. ఇలా షెడ్యూల్ చేసుకుంటే దంపతుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయట. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారట. అయితే చాలా మంది ఇలా చేయడానికి మొహమాట పడుతుంటారు. శృంగారం చేయడానికి షెడ్యూల్ ఏంటని ఆశ్చర్య పోతారు. మరికొంత మంది ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకుని యాంత్రికంగా సెక్స్ చేయడం అవసరమా అని ఆలోచిస్తారు. కానీ అలా చేసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఉపయోగాలు, లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భార్యాభర్తలు ఎవరైనా షెడ్యూల్ చేసుకుంటే ఆ సమయంలో శృంగారంలో తేలిపోవడం మాత్రమే కాదు, మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది. ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమ ఆ సమయంలో బయటికి వచ్చి ఒకరినొకరు ఎంత మిస్ అవుతున్నారో తెలుస్తుంది. ఇలా చేయడం ద్వారా వారిలో ఉండే ఒత్తిడి కూడా తగ్గిపోతుందని చెబుతారు. అంతే కాదు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందట. కాపురంలో ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు ఆ సమయంలో వారిద్దరూ మట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో వారి మధ్య సంభాషణ పెరిగి కలహాలు దూరమవుతాయట. అలాగే మీ జీవిత భాగస్వామికి సంపూర్తిగా తృప్తి కూడా కలుగుతుందంట. కాపురానికి షెడ్యూల్ పెట్టుకోవడం ద్వారా దంపతుల మధ్య లైంగిక కోరికలు కూడా తగ్గకుండా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.