వైవాహిక ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందా?

by samatah |   ( Updated:2022-11-09 07:30:13.0  )
వైవాహిక ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : వైవాహిక జీవితంలో విభేదాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచగలవని తాజా అధ్యయనం పేర్కొంది. నిజానికి పెళ్లితో మనసుకు, శరీరానికి మేలు జరుగుతుందనే ఆలోచన చాలా కాలంగా ఉండేది. కానీ అమెరికాలోని యేల్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కొంతమంది పరిశోధకులు ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. మ్యారేజ్ లైఫ్‌లో టెన్షన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.

యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు 1,500 మంది రోగులపై అధ్యయనం నిర్వహించారు. వీరంతా గుండె జబ్బులతో బాధపడుతున్నవారే కాగా.. ఈ పరిస్థితి తలెత్తిన తర్వాత వారు ఏడాదిపాటు ఎలా జీవించారనే అంశాలను పరిశోధకులు పరిశీలించారు. పార్టిసిపెంట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని తెలుసుకునే క్రమంలో పెళ్లిలో టెన్షన్ ఉందా? లేదా? అని అడగ్గా.. దాదాపు 40 శాతం మంది స్త్రీలతో పాటు 30 శాతం మంది పురుషులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీని నుంచే మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఇక ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో దాదాపు 50 శాతం మంది ఏదో ఒక కారణంతో మళ్లీ ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదేకాక వివాహ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే చాతి నొప్పి వచ్చే ప్రమాదం 67 శాతం పెరిగిందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ కాన్ఫరెన్స్‌లో ప్రచురిచితమయ్యాయి. వైవాహిక విభేదాల వల్ల ఏర్పడే ఆందోళన, ఒత్తిడి గుండె జబ్బుల నుంచి కోలుకునే మార్గంలో అడ్డంకులుగా మారవచ్చని ప్రధాన పరిశోధకుడు సెంజింగ్ ఝూ అభిప్రాయపడ్డాడు.

Read more:

1.Health tips:పగిలిన పాదాలకు ఈ విధంగా చెక్ పెట్టేయండి !

2. మూడ్ స్వింగ్స్‌కు దారితీస్తున్న హార్మోనల్ చేంజెస్‌..

Advertisement

Next Story