ముందే మార్కెట్‌లోకి వచ్చిన మామిడిపండ్లు.. ధర తెలిస్తే ఖంగుతినాల్సిందే?

by Anjali |
ముందే మార్కెట్‌లోకి వచ్చిన మామిడిపండ్లు.. ధర తెలిస్తే ఖంగుతినాల్సిందే?
X

దిశ, ఫీచర్స్: పండ్లలోనే రారాజుగా పిలిచే మామిడిపండ్లు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే మామిడి పండ్లు ఎప్పుడైనా మార్చి నెల ఆఖరిలో లేదా ఏప్రిల్ నెల ప్రారంభంలో మార్కెట్‌లోకి వస్తాయి.

కానీ ప్రస్తుతం హైదరాబాదు మార్కెట్‌లోకి ముందే వచ్చేసి ధరలు సాధారణ ప్రజల్ని షాక్‌కు గురి చేస్తున్నాయి. ఎంటో టేస్టీగా ఉంటే ఈ పండ్లు ముందుగా మార్కెట్‌లోకి రావడంతో మామిడి ప్రియులు సంతోషపడుతున్నారు కానీ ధరలు చూశాక కొనడానికి వెనకడుగెస్తున్నారు. ప్రస్థుతం హైదరాబాద్‌లో కిలో మామిడిపండ్ల ధర రూ.450 రూపాయల వరకు పలుకుతోంది.

నగరంలో మామిడి పండ్ల రకాలను బట్టి ధరలు చూసినట్లైతే.. మేలు రకమైన హిమాయత్ రకం కిలో రూ.400 నుంచి 450 రూపాయల దాకా అమ్ముతున్నారు. బాగా స్వీట్ ఉండే మామిడి రసాలు కిలో రూ.200 నుంచి 250 రూపాయలు. బెనిషన్ రకం కిలో రూ.150 నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed