లవ్-యాంబిషన్? ఎటూ తేల్చుకోలేకపోతున్న యువత..

by Hamsa |   ( Updated:2023-02-14 04:24:13.0  )
లవ్-యాంబిషన్? ఎటూ తేల్చుకోలేకపోతున్న యువత..
X

దిశ, ఫీచర్స్: కాలేజ్.. క్యాంటీన్.. కరెన్సీ.. కాక్‌టెయిల్స్.. కరెక్ట్ పార్ట్‌నర్.. కాదల్.. సాధారణంగా యూత్‌ లైఫ్ వీటి చుట్టే తిరుగుతుంటుంది. కానీ డ్రీమ్స్, యాంబిషన్స్ యాడ్ అయినప్పుడే డైలామా స్టార్ట్ అవుతుంది. మానవ సంబంధాల విషయంలో యువత ఆలోచన మారిపోతుంది. ప్రేమించిన వ్యక్తితో ఎలా మసులుకోవాలనే ఆలోచన.. కలను సాకారం చేసుకోవాలనే ఆశయ సాధన.. రెండూ కలిసి ఆందోళనను సృష్టిస్తాయి. వ్యక్తిగత నడవడిక, అవకాశాలు, వృత్తిపరమైన ఆంక్షల నడుమ సతమతం అవుతుంటారు. ఇలాంటి అంశాలను బ్యాలెన్స్ చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలేమిటి అనేది 'అన్‌సార్టెడ్' సిరీస్ కథ. కాగా లవ్, డైలమా, యాంబిషన్స్ ఎలా ఢీకొంటున్నాయనేది చక్కగా తెరకెక్కించారు.

కథనంలో ఏముంది?

అన్సార్టెడ్ సిరీస్‌లోని పలు సన్నివేశాలు, పాత్రలు పాతకాలపు మానవ సంబంధాల ధోరణితో ప్రారంభం అవుతాయి. అంత మాత్రాన చూడటం ఒక గంట సమయం వృథా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి పార్టులోని ప్రతీ పాత్ర యువత కలలు, ఆశయాలు, అవకాశాల, డైలమాల చుట్టూ తిరుగుతుంది. ముంబై బేసిగ్గా తీసిన ఈ సిరీస్‌లో తారా(ముగ్ద అగర్వాల్), సెహర్ (తన్యా సింగ్ భట్నాగర్), నమన్ (విక్రం భుయ్) నటీనటులుగా ఉన్నారు. అయితే తారా నమన్‌ల మధ్య ప్రేమతో కథనం మొదలవుతుంది. ఆ తర్వాత వారు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది మెయిన్ కాన్సెప్టుగా ఉంటుంది. తమ జీవితాన్ని లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్‌గా మార్చుకునే విషయంలో డైలమాను ఎదుర్కొంటారు. అనేక ట్విస్టులంటాయి. అనూహ్యంగా వీరి ప్రేమ కథ ట్రయాంగిల్ మలుపు తిరుగుతుంది. అవకాశాలు, నిర్ణయాల విషయంలో వీరు ఎటువంటి ముందడుగు వేస్తారనేది కథనంలో ఆసక్తిరేకెత్తించే అంశం.

కాస్త గందరగోళమే.. అయినా..

జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు, సంఘటనలు, నిర్ణయాలు సాధారణంగా మానవ సంబంధాల మధ్య వివిధ అంశాలను కథనంలో చూడొచ్చు. మనలో చాలా మంది తమ రోజువారీ, సాధారణ జీవితంలో మాదిరిగానే సిరీస్‌లోని పాత్రలు ప్రేమ, పెళ్లి, అవకాశం, ఆశయం, ఆందోళన చుట్టూ తిరుగుతాయి. ఉద్యోగం లేదా వృత్తిపరమైన ఆకాంక్షలు, పర్సనల్ ఇష్యూస్‌ మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే సందేశాన్ని అందించే గొప్ప ప్రయత్నమే సిరీస్ ప్రధానాంశం.

ఇవి కూడా చదవండి : Love After Divorce.. లైఫ్‌ను రీస్టార్ట్ చేయడంలో ఆలస్యమెందుకు?

Advertisement

Next Story

Most Viewed