VIRAL VIDEO : ఎలుగు బంటిని దగ్గరకు తీసుకుని మరీ ప్రేమగా పుచ్చకాయ తినిపిస్తున్న వ్యక్తి.. అంతే ప్రేమతో అది కూడా ఏం చేసిందంటే...

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-10 17:50:12.0  )
VIRAL VIDEO : ఎలుగు బంటిని దగ్గరకు తీసుకుని మరీ ప్రేమగా పుచ్చకాయ తినిపిస్తున్న వ్యక్తి.. అంతే ప్రేమతో అది కూడా ఏం చేసిందంటే...
X

దిశ, ఫీచర్స్ : రష్యాకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్ లో స్టార్మ్ క్రియేట్ చేస్తుంది. ఓ వ్యక్తి ప్రేమగా దగ్గర తీసుకుని ఎలుగు బంటికి వాటర్ మిలన్ తినిపిస్తున్న వీడియోకు లైక్స్ పడుతూనే ఉన్నాయి. అది కూడా అంతే లవ్ యాక్సెప్ట్ చేస్తూ హాయిగా ఆస్వాదిస్తోంది.ఇప్పటికే ఈ వీడియో 13 మిలియన్ వ్యూస్ కూడా సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'ఆహా మనిషికి జంతువులకు మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే కడుపు నిండిపోతున్నట్లు అనిపిస్తుంది', 'ఎలుగుబంటి ఇంత ప్రశాంతంగా ఉండటం అమేజింగ్ గా అనిపిస్తుంది. ఒక కథ నిజంగా కళ్ల ముందు కనిపిస్తునట్లు అనిపిస్తుంది ', 'నాకు అలాంటి ఒక రోజు రావాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని కామెంట్స్ చేస్తున్నారు.

రష్యాలో ఎలుగుబంట్లు దేశపు ధనిక, విభిన్న వన్యప్రాణులకు చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. విస్తారమైన రష్యన్ అరణ్యం ఈ గంభీరమైన జీవులకు అనువైన నివాసాన్ని అందిస్తుంది. రష్యన్ ఎలుగుబంట్లు.. ముఖ్యంగా సైబీరియన్ ఎలుగుబంటి, వాటి ఆకట్టుకునే పరిమాణం, బలానికి ప్రసిద్ధి చెందాయి. రష్యన్ సంస్కృతి, జానపద కథలలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇవి తరచుగా శక్తివంతమైన, సున్నితమైన రాక్షసులుగా చిత్రీకరించబడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed