Love After Divorce.. లైఫ్‌ను రీస్టార్ట్ చేయడంలో ఆలస్యమెందుకు?

by Mahesh |   ( Updated:2023-02-14 04:48:29.0  )
Love After Divorce.. లైఫ్‌ను రీస్టార్ట్ చేయడంలో ఆలస్యమెందుకు?
X

దిశ, ఫీచర్స్: ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కసారి లవ్, మ్యారేజ్ ఫెయిల్ అయితే మరోసారి చాన్స్ తీసుకునేందుకు భయపడుతుంటారు చాలా మంది. డైవోర్స్‌‌కు ముందు అనుభవించిన బాధ మరోసారి రిపీట్ అయితే తట్టుకోలేమని సంకోచిస్తుంటారు. కానీ 'Love After Divorce' అనేది లైఫ్‌ను రీస్టార్ట్ చేయడమేనని ఎందుకు అనుకోకూడదు అంటున్నారు నిపుణులు. 'సింగిల్‌'గా ఉండి జీవితాన్ని భారంగా మార్చుకునే బదులు నచ్చిన మరో వ్యక్తితో 'మింగిల్' అయిపోయి.. సంతోషంగా ఉండటం మంచిది కాదంటారా? ఇప్పటికే పుట్టిన బిడ్డకు తల్లి/తండ్రిని బహుమతిగా ఇవ్వడం కరెక్ట్ కాదా?

మీకు సరైన వ్యక్తి ప్రపోజ్ చేసినట్లు అనిపిస్తే.. డేట్ చేయడంలో తప్పులేదు. ఒక్క కాఫీ డేట్ మీలో రిఫ్రెష్‌మెంట్ ఇవ్వొచ్చు. ఒక్క డిన్నర్ డేట్ మీరు కరెక్ట్ వే ఎంచుకునేందుకు కారణం కావచ్చు. ఒక్క లవెబుల్ కన్వర్జేషన్ మిమ్మల్ని హీల్ చేయొచ్చు. మనసులోని గాయాలను మాన్చేసే మందు దొరికినప్పుడు.. దాన్ని పట్టుకోవడంలో తప్పే లేదు అంటున్నారు నిపుణులు. మళ్లీ ప్రేమలో పడేందుకు రైట్ రీజన్స్ ఉన్నప్పుడు.. గతంతో పనేంటి? పాస్ట్‌ను తుడిచేసి పార్ట్‌నర్‌తో సహా ఫ్యూచర్‌కు వెల్‌కమ్ చెప్పేయండి. జీవితాన్ని సంతోషమయం చేసుకోండి. So, Keep Falling In Love - దిశ, ఫీచర్స్

ఇవి కూడా చదవండి :

1.లవ్-యాంబిషన్? ఎటూ తేల్చుకోలేకపోతున్న యువత..

2.ప్రేమికుల వారం మాదిరిగానే యాంటీ-వాలెంటెన్స్ వీక్

Advertisement

Next Story

Most Viewed