- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుమ్మడికాయతో మెరిసిపోయే చర్మం.. ఎలాగో తెలుసా..
దిశ, ఫీచర్స్ : గుమ్మడికాయ అనేక పోషకాలతో కూడిన కూరగాయ. అయినప్పటికీ చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు. అయితే కొంతమంది కొన్ని కూరగాయలు కోసేటప్పుడు అందులోని గింజలను చెత్తగా భావించి పారేస్తుంటారు. అయితే కూరగాయలలో లభించే గింజలు చర్మ సంరక్షణలో అనేక రకాలుగా ఉపయోగపడతాయని చర్మవైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే గుమ్మడికాయ గింజలను కూడా పారేస్తూ ఉంటారు. మరి గుమ్మడిగింజలతోనే కాదు గుమ్మడి కాయతో కూడా చర్మ సౌందర్యం పెరిగిపోతుందని చాలా మందికి తెలిసి ఉండదు. దీన్ని మీరు చర్మసంరక్షణలో మాత్రమే కాకుండా హెయిర్ కేర్, బాడీ స్క్రబ్ గా కూడా సిద్ధం చేసుకోవచ్చు. గుమ్మడికాయను ఉపయోగించడం ద్వారా మీరు మెరిసే చర్మాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు చెప్పుకుందాం.
గుమ్మడికాయ ఫేస్ ప్యాక్..
గుమ్మడికాయ ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా దాని పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఆపై తేనె, పాలు కలిపి ఫేస్ మాస్క్‌ను సిద్ధం చేయండి. ఇది ముఖంలోని మృతకణాలను తొలగించి చర్మం లోపల నుంచి మెరిసేలా చేస్తుంది. ఈ మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత, ఫేస్ మాస్క్‌ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత మాస్క్ ఆరిపోయిన వెంటనే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలట. తరువాత కొంచెం మాయిశ్చరైజర్ రాయాలని చెబుతున్నారు నిపుణులు.
ఫేషియల్ టోనర్..
మీరు మార్కెట్‌లో అనేక రకాల ఫేషియల్ టోనర్‌లను కొనుగోలు చేస్తుంటారు. కానీ మీరు గుమ్మడికాయను ఉపయోగించి ఇంట్లోనే ఫేషియల్ టోనర్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. గుమ్మడికాయలో యాంటీ - ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా ముఖం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఫేషియల్ టోనర్ చేయడానికి, గుమ్మడికాయ గుజ్జులో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్, విచ్ హాజెల్ కలపండి. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి రోజ్ వాటర్ వేసి స్ప్రే బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. విచ్ హాజెల్ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది.
గుమ్మడికాయతో బాడీ స్క్రబ్..
బాడీ స్క్రబ్ చేయడానికి మీరు గుమ్మడికాయను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు బ్రౌన్ షుగర్, ఆలివ్ నూనెతో గుమ్మడికాయ పేస్ట్ కలపడం ద్వారా బాడీ స్క్రబ్‌ను సిద్ధం చేయవచ్చు. దీని వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవ్వడమే కాకుండా మృదువుగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని లోపలి నుండి తేమ చేస్తుంది.