జూన్-7: నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

by Anjali |   ( Updated:2023-06-07 14:42:44.0  )
జూన్-7: నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఆహార భద్రత, పౌష్టికాహార ప్రాధాన్యం, కలుషిత ఆహారం, నీరుతో కలిగే అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్ధేశం. 2018 నుంచి ఐక్యరాజ్య సమితి జూన్ 7వ తేదీని ‘‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’’గా నిర్వహిస్తోంది. ప్రస్తుత సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ కారణంగా జనాలు మరింతగా అనారోగ్య పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ద్వారా శుభ్రమైన, సురక్షితమైన ఆహారపు ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి జనాలకు అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

కాగా, మానవ ఆరోగ్యానికి, ఆర్థిక శ్రేయస్సుకు, సుస్థిర అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి, పర్యాటక రంగానికి సురక్షిత ఆహారం, ఆహార భద్రత ఎంతో ప్రధానమైనదో ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్ధేశం. WHO 2019 రిపోర్ట్ ప్రకారం.. వర్ల్ వైడ్ ప్రతి సంవత్సరం కలుషిత ఆహారం కారణంగా 600 మిలియన్ల జనాలు అనారోగ్య బారిన పడుతున్నారు. దీని లెక్క ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు. అలాగే ఈ కలుషిత ఆహారం కారణంగా 5 ఏళ్ల లోపు పిల్లలైన 1,25,000 మంది చనిపోతున్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే అన్నం పారేయడానికి ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక రైతు పగలనక రేయినక ఆ పంట పండించడానికి ఎంత కష్టపడతాడో గుర్తు చేసుకుని ఆహారాన్ని అస్సలు వృథా చేయకండి.

Advertisement

Next Story

Most Viewed