Health tips: రోజుకు 2 లీటర్ల నీరు చాలు.. పూర్తి ఆరోగ్యం మీ సొంతం!!

by Hamsa |   ( Updated:2022-11-29 14:14:44.0  )
Health tips: రోజుకు 2 లీటర్ల నీరు చాలు.. పూర్తి ఆరోగ్యం మీ సొంతం!!
X

దిశ, ఫీచర్స్: వాతావరణ మార్పులు, జీవనశైలికి అనుగుణంగా ప్రతి మనిషికి రోజుకు కనీసం నాలుగైదు లీటర్ల నీరు అవసరం అవుతుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. కానీ తాజా జపనీస్ అధ్యయనం రోజుకు కేవలం 2 లీటర్ల నీరు తీసుకోవడం వల్ల ప్రామాణిక ప్రజారోగ్య మార్గదర్శకాలు అత్యధికంగా ఉన్నాయని వెల్లడించింది.

జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇన్నోవేషన్‌కు చెందిన రచయితలలో ఒకరైన యోసుకే యమడ ఈ అంశంపై మాట్లాడారు. చాలామందికి 1.5 నుంచి 1.8 లీటర్ల నీరు సరిపోతుందని అధ్యయనం నిర్ధారించింది. 'బ్రెడ్, ఎగ్స్ వంటి ఫుడ్‌తో మాత్రమే కాకుండా నీటి అవసరాలతో సుమారు 50శాతం ఆహారం పొందవచ్చని' తెలిపారు. తాగునీటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చును కూడా హైలెట్ చేసిన అధ్యయనం.. ఐసోటోప్-లెబలింగ్ టెక్నిక్‌ ఆధారంగా నీటిని తీసుకోవడం మరియు నష్టానికి సంబంధించిన విషయంపై 23 దేశాలకు చెందిన 5600 మందిపై రీసెర్చ్ చేసింది.

ఇందులో ముఖ్యంగా ప్రతి రోజు శరీరం ఉపయోగించే నీటి పరిమాణాన్ని సూచించే 'వాటర్ టర్నోవర్' గురించి వివరించారు. 20 నుంచి 35 సంవత్సరాల వయసు గల పురుషులకు సగటున 4.2 లీటర్లు.. 30 నుంచి 60 సంవత్సరాల వయసు గల స్త్రీలకు 3.3 లీటర్ల వాటర్ టర్నోవర్ ఉంటుండగా.. వృద్ధుల్లో మాత్రం గణనీయంగా తక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా వాతావరణ మార్పుల కారణంగా విపత్తులు సంభవించే ప్రాంతాలు, నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలలో కనీస నీటి మొత్తాన్ని నిర్ణయించడానికి ఈ సమీకరణం సహాయపడుతుందని చెబుతున్నారు. వాటర్ టర్నోవర్ మానవ ఆరోగ్యానికి సంబంధించిందని అధ్యయనాలు చూపిస్తున్నందున ఈ సమీకరణం అనారోగ్యాన్ని నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు.

READ MORE

భర్తలను కంట్రోల్ చేయడానికి చిట్కాలిస్తూ బిజినెస్ చేస్తున్న యువతి..!

Advertisement

Next Story

Most Viewed