జనవరి 02: కొండెక్కిన కోడిగుడ్డు ధర.. ఒక్కో గుడ్డు ధర ఎంతంటే?

by Anjali |
జనవరి 02: కొండెక్కిన కోడిగుడ్డు ధర.. ఒక్కో గుడ్డు ధర ఎంతంటే?
X

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువులతో పాటు కోడి గుడ్ల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ రేట్లు ఎక్కువగా ఉండటంతో కనీసం కోడి గుడ్డు అయినా తిందాం అనుకునేవారికి గుడ్డు భారంగా మారింది. మొన్నటిదాక టమాట, ఉల్లిగడ్డ కొనాలంటే సామాన్యుడు భయపడిపోయాడు. ఇక ఇప్పుడు కోడిగుడ్డు వంతు వచ్చింది. రోజురోజుకు కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కార్తీకమాసం అయిపోయాక.. గుడ్ల వినియోగం, ధరలు పెరుగుతున్నాయి.

గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50 ఉంది. వారం రోజుల క్రితం రూ.6 కు చేరుకుంది. నిన్నటి వరకు రూ.7 ఉండగా.. ఇప్పుడు హోల్ సేల్‌లో ఓక్కో గుడ్డు 8 రూపాయలు పలుకుతోంది. గత 15 రోజుల క్రితం కేసు ధర 160 రూపాయలు ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో రూ. 6 కు విక్రయించారు. ఇప్పుడు కేసు ధర రూ. 180 నుంచి 200 రూపాయలు ఉంది. కాగా మార్కెట్‌లో రూ. 7 నుంచి రూ. 8 వరకు అమ్ముతున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

గత 20 రోజులుగా చలి తీవ్రంగా పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, తద్వారా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పెంపకందారులు చెబుతున్నారు. మరోవైపు, దాణా ఛార్జీలు పెరగడం, వాహనదారులు గత రెండు నెలల్లో రవాణా ఖర్చులు 15 శాతం పెంచడం వల్ల గుడ్ల ధర పెరిగిందని పౌల్ట్రీ వర్గాలు వెల్లడించాయి.

ఇక చలి కారణంగా వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాదు లో గుడ్లకు బాగా డిమాండ్ ఉంటుందంటున్నారు. మిగతా పట్టణాలతో పోలిస్తే.. హైదరాబాదులోనే ఎగ్స్ ఎక్కువగా వాడుతారని చెబుతున్నారు. కాగా రానున్న రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed