- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూత్రంలో మంటగా ఉందా.. అయితే జాగ్రత్త?
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మూత్ర మార్గంలో కానీ, మూత్ర వ్యవస్థలో కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రంలో ఈ సమస్య వస్తుంది. కానీ కొంత మందిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేనప్పుడు కూడా మూత్రంలో మంట వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మందిని వేధించే సమస్య ఈ మూత్రంలో మంట. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు మూత్రంలో లవణాల గాఢతను సంతరించుకుంటాయి, వీటితో పాటు ఆమ్లత్వం పెరిగిపోతుంది కాబట్టి.. అటువంటి సమయంలో మూత్ర విసర్జన కూడా చేయలేరు. ఈ సమస్య వచ్చినప్పుడు మూత్రం కొద్దీ కొద్దిగా వస్తుంటుంది. మూత్రం పోశాక కూడా కొంత సేపటి వరకు మంట ఉంటుంది. మరి కొంత మందిలో పొత్తి కడుపు నొప్పి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కా గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నీరుల్లి, పంచదారతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత నీరుల్లి పాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్లాస్ నీటిలో వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి పొయ్యి మీద సన్నని మంట మీద మరగనివ్వాలి. ఈ నీరు చల్లారిన తర్వాత దానిలో ఒక టీ స్పూన్ పంచదార వేసి సేవించాలి. ఇలా ఉదయం, సాయంత్రం, రాత్రి సేవిస్తే.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Read More..