ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద మంచిదా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే..?

by Prasanna |
ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద మంచిదా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే..?
X

దిశ, ఫీచర్స్: పచ్చి కలబంద వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు రంగు కలబంద ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎర్ర కలబంద మొక్క శుష్క ప్రాంతాలలో పెరుగుతుంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని "క్వీన్ అలోవెరా" అని పిలుస్తారు. దీనిలో విటమిన్ ఎ, సి, ఇ, బి12 , ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది:

ఎరుపు రంగు కలబందలో ఉండే సపోనిన్లు, స్టెరాల్స్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నొప్పి నుంచి ఉపశమనం:

ఎరుపు కలబందలోని సాలిసిలిక్ యాసిడ్, పాలీశాకరైడ్‌లు కండరాలను సడలించి మంటను తగ్గిస్తాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్‌ల నుండి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్‌ కంట్రోల్‌:

రెడ్ కలబంద ప్రీ డయాబెటిస్‌ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌కు పరిమిత పరిమాణంలో వినియోగం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సాగు పరిమితంగా ఉండటంతో పాటు మాత్రంగానే ఉన్నందున ధర ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed