Heart attack : మహిళల్లో అధిక చెమటలు గుండెపోటుకు సంకేతమా?

by Jakkula Samataha |
Heart attack : మహిళల్లో అధిక చెమటలు గుండెపోటుకు సంకేతమా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఒకప్పటి కాలంలో పెద్దవారిలోనే హార్ట్ ఎటాక్ సమస్య ఉంటుందని తెలుసు. కానీ ప్రజెంట్ జనరేషన్ లో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటు సమస్య ఎప్పుడు ఎటు నుంచి ఎటాక్ చేస్తోందో తెలియదు. గుండె పోటు లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయని వాటిని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి అని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటుకు ప్రధానంగా ఆహారం కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు గుండె జబ్బులు పెరగడానికి కారణం అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని లక్షణాల ద్వారా గుండె జబ్బులను ముందే గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మహిళల్లో, పురుషుల్లో ఈ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. ఇక మహిళల్లో ఈ సమస్యలను గుర్తించడం కొంతవరకు కష్టం అంటున్నారు.

*చాలామందికి విపరీతమైన చెమటలు పడుతుంటాయి. కొన్ని సార్లు టెన్షన్ పడితే చెమటలు వస్తుంటాయనే విషయం తెలిసిందే. కానీ ఆకస్మాత్తుగా చల్లగా చెమటలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది గుండెపోటు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

*సాధారణంగా ఎడమవైపు లేదా మధ్యలో ఛాతిలో ఒత్తిడి, లేదా ఆయాసంగా అనిపిస్తుంది. ఇలా ఆయాసం కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. ఈ లక్షణం ఒక క్లాసిక్ సంకేతం. కానీ మహిళల్లో తీవ్రత ఎక్కువగా ఉండకపోవచ్చు.

*గుండెపోటు నుంచి నొప్పి నెమ్మదిగా వీపు, మెడ, దవడ లేదా చేతులకు పాకుతుంది. ఈ నొప్పి ఛాతీకి సంబంధం లేనట్లే కనిపిస్తుంది. కానీ ఇది గుండెపోటు సంబంధిత లక్షణంగా పరిగణించాలని వైద్యులు చెబుతున్నారు.

*చాలా మంది మహిళలు ఛాతీలో నొప్పి ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణం అకస్మాత్తుగా లేదంటే ఏదైనా పని చేస్తుంటే వస్తుంది. ఛాతిలో ఆయాసం గా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

*వికారం లేదా వాంతులు సహా జీర్ణశయాంతర సమస్యలు కూడా గుండెపోటు లక్షణాలే. ఈ లక్షణాలు కొన్నిసార్లు ఇతర జీర్ణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాము.

*శారీరక శ్రమతో సంబంధం లేని విపరీతమైన అలసట గుండెపోటు లక్షణమే. ఈ అలసట తరచుగా వస్తుంది. తీవ్రంగా స్థాయిలో ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.

*మూర్ఛ లేదా తలతిరినట్లుగా అనిపిస్తే అది గుండెపోటును సూచిస్తుంది. రక్తప్రసరణ తగ్గడం వల్ల కూడా మూర్చ పోతున్నట్లు తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి.

NOTE:ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సందర్శించడం మంచిది.

Advertisement

Next Story