ఉపవాసంలో వ్యాయామం మంచిదేనా?

by Hajipasha |   ( Updated:2023-01-11 13:03:28.0  )
ఉపవాసంలో వ్యాయామం మంచిదేనా?
X

దిశ, ఫీచర్స్: మన లైఫ్ స్టైల్‌లో ఎక్సర్‌సైజ్ చేర్చడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. చురుకుదనాన్ని కలిగించడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుందని అధ్యయనాలు నిరూపించాయి. కానీ 'ఉపవాసం సమయంలో వ్యాయామం చేయాలా వద్దా?' అనేది చాలా మందిలో నెలకొన్న సందేహం కాగా.. ఆరోగ్యంగా ఉంటే ఫాస్టింగ్ టైమ్‌లో ఎక్సర్‌సైజ్ సురక్షితమే అంటున్నారు. ఇది హ్యూమన్ గ్రోత్ హార్మోన్‌ను ఇంక్రీజ్ చేయడంలో సహాయపడుతుందని.. తద్వారా సెల్స్ రిపేరింగ్, జీవక్రియ, కండరాల పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఎలాంటి వ్యాయామం మంచిది?

ఈ సమయంలో తక్కువ లేదా మితమైన-తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయాలి. ఎందుకంటే ఇవి నిల్వ చేయబడిన శరీర కొవ్వు నుంచి ఎక్కువ శక్తిని వినియోగించబడుతుంది. హై ఇంటెన్స్ ఎక్సర్‌సైజ్‌కు ఎక్కువ పిండి పదార్థాలు అవసరం కాబట్టి వాటిని నివారించాలి. కారణం ఉపవాసం ఉన్నందున శరీరంలో వర్కౌట్‌లకు ఇంధనం ఇవ్వడానికి తగినంత పిండి పదార్థాలు లేవు. దీంతో అలసిపోతారు. సామర్థ్యాన్ని మించి చేస్తే మూర్ఛపోవచ్చు కూడా.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

కరోనరీ ఆర్టరీ డిసీజ్, మధుమేహం, హైపర్ టెన్షన్‌కు మందులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి. కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారు వర్కవుట్‌ల సమయంలో.. గుండెపై అధిక ఒత్తిడి కలుగుతుంది. తద్వారా హృదయ స్పందన రేటు పెరిగితే గుండె సంబంధిత సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది. అలాంటి వారు ఈ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. మందులు వాడుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర లెవెల్స్ పడిపోకుండా జాగ్రత్త వహించాలి. అలాంటి వ్యక్తులు తరచుగా తినకపోతే రక్తంలో చక్కెర చాలా తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఉపవాస సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఇది మరింత అధ్వాన్న స్థితికి పడిపోతుంది. ఇది వారికి ప్రాణాంతకం కావచ్చు. అలాంటప్పుడు తక్కువ సమయంలో, తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం చేయడంతో పాటు బాడీ హైడ్రేట్‌గా ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలసట, తలనొప్పి కలిగితే వెంటనే వ్యాయామం ఆపేయడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed