- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పెంపుడు జంతువులను ఏసీ గదిలో ఉంచొచ్చా?
దిశ, ఫీచర్స్: వేసవి జంతువులకు కూడా కఠినమైన సమయమే. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, డయేరియా వంటి హీట్ రిలేటెడ్ వ్యాధులు తలెత్తే అవకాశం ఉండగా.. వాటిని చల్లటి ప్రదేశంలో ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. అయితే అధిక వేడిని తట్టుకోలేకపోతున్న పెంపుడు జంతువులను ఏసీ రూమ్‌లో ఉంచవచ్చా? అనే అనుమానం యజమానులను వేధిస్తుంది. కాగా దీనిపై స్పందిస్తున్న నిపుణులు.. భరించలేనంత ఉష్ణోగ్రతతో డీహైడ్రేట్‌కు గురైన పెట్ డాగ్స్ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎయిర్ కండిషనింగ్ సురక్షితమైనదేనని సూచిస్తున్నారు.
దీని వల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ లాభాలు మాత్రం లేకపోలేదని చెప్తున్నారు. వేడిని తట్టుకోలేని శునకాలకు ఎయిర్ కండిషనింగ్ ఉపశమనం కలిగిస్తుందంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ, హృదయ సంబంధిత వ్యాధులు ఉన్న వాటికి ఇంపార్టెంట్ అని తెలిపారు. అంతేకాదు ఈ చల్లదనం హీట్ స్ట్రోక్‌ను నివారించి కాపాడుతుందంటున్నారు. అయితే ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు కొన్ని పెంపుడు జంతువుల్లో ఒత్తిడిని కలిగిస్తాయంటున్న నిపుణులు.. ప్రత్యేకించి వాటి కోసమే ఉపయోగిస్తే అధిక చల్లటి గాలికి గురికాకుండా చూసుకోవడం మంచిదని అంటున్నారు. ఫైనల్‌గా పెట్ డాగ్‌కు అనువైన వాతావరణాన్ని అందించాలని చెప్తున్నారు.
Also Read..
బ్రెడ్ ప్యాకెట్లో మొదటి, చివరి బ్రెడ్ కాస్త డిఫరెంట్‌గా ఎందకు ఉంటుందో తెలుసా?