మానవుల్లో అమరత్వం.. సెనోలైటిక్ ఔషధాలతో వృద్ధాప్య కణాలు నాశనం

by sudharani |
మానవుల్లో అమరత్వం.. సెనోలైటిక్ ఔషధాలతో వృద్ధాప్య కణాలు నాశనం
X

దిశ, ఫీచర్స్ : మనుషులు అమరత్వం పొందడమనేది ఫాంటసీ లేదా సైన్స్ ఫిక్షన్ సినిమాలు, నవలల్లోనే సాధ్యం. నిజానికి ఎప్పటికీ ఉనికిని కోల్పోకుండా ఉండటమనే ఆలోచన కచ్చితంగా మనోహరంగా ఉంటుంది. కానీ ఏ జీవికైనా మరణం తప్పదని మనకు తెలిసిన సత్యం ఆ ఊహలను నియంత్రిస్తుంది. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నేటి శాస్త్ర సాంకేతికత ప్రత్యేకత. అమరత్వం ఆలోచనను నిజం చేయవచ్చని డాక్టర్ జోస్ కార్డిరో విశ్వసిస్తున్నాడు. మానవ జీవితాన్ని విస్తరించేందుకు సాంకేతికతను నైతికంగా ఉపయోగించాలని సూచించే అంతర్జాతీయ లాభాపేక్ష రహిత సభ్యత్వ సంస్థ 'హ్యుమానిటీ ప్లస్‌'కు ఆయన వైస్ చైర్మన్.

కార్డిరో ప్రకారం, భవిష్యత్తులో ఆసక్తి ఉన్న ఎవరైనా తమ ఆయువును దీర్ఘకాలం పెంచుకోవచ్చు. 'మీరు దీర్ఘాయువును చూడకపోతే, భవిష్యత్తును చూడలేరు. క్యాన్సర్ చికిత్స వృద్ధాప్యాన్ని ఎలా ఆపగలమో మార్గదర్శకం చేసింది. అలాగే అమరత్వం ఎలా పొందుతామో కూడా కనుగొనవచ్చు. 2030 సంవత్సరానికి సురక్షితంగా చేరుకునే వ్యక్తులు తాము జీవించి ఉన్న ప్రతి సంవత్సరం ఒక సంవత్సరాన్ని అదనంగా పొందగలరు. 2045 నాటికి పునరుజ్జీవన సాంకేతికతను సాధించగలం. మనం మానవ చరిత్రలో అత్యంత అద్భుతమైన కాలంలో(చివరి మోర్టల్ జనరేషన్, మొదటి ఇమ్మోర్టల్ జనరేషన్) జీవిస్తున్నాం' అని అన్నారు కార్డిరో.

వైద్య శాస్త్రంలో పురోగతి ద్వారా అమరత్వం

'వృద్ధాప్యం అనేది అత్యంత సంక్లిష్టమైన చికిత్సా ప్రాంతం. మనం వైఫల్యాలను ఆశించాలే గానీ అద్భుతాలను కాదు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమను మార్చడానికి కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ ఉపయోగించడంతో పాటు ఎక్కువ కాలం జీవించడంలో సాయపడే మందులను కనుగొనడం కీలకం' అని AIతో పనిచేసే ఫార్మా-టెక్నాలజీ సంస్థ 'ఇన్సిలికో మెడిసిన్' ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అలెక్స్ జవోరాంకో తెలిపారు. ఇది కొంతవరకు నిజమే. ఎక్కువ కాలం జీవించడంలో ఒక అంశం వైద్యరంగంలో పురోగతి సాధించడమే. వైద్య శాస్త్రం ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడం కూడా ఈ గ్రహం మీద ఒక వ్యక్తి ఆయుష్షును గణనీయంగా పెంచడంలో సాయపడుతుంది. ఉదాహరణకు.. 1881లో భారతదేశంలో సగటు ఆయుర్దాయం దాదాపు 25.4 ఏళ్లు. ఇప్పుడు 69.7 ఏళ్లు. వైద్యరంగంలో పురోగతే దీనికి ప్రధాన కారణం. అయితే భవిష్యత్‌లో సాధించే మరిన్ని పురోగతులతో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.

అమరత్వానికి మార్గం

'వృద్ధాప్యం గర్భధారణకు ముందే ప్రారంభమవుతుంది. వృద్ధాప్యంతో ముడిపడిన కొన్ని ప్రాథమిక ప్రక్రియలను లక్ష్యంగా చేసుకుంటే అమరత్వం సాధ్యమవుతుంది. మేము వృద్ధాప్య కణాలను నాశనం చేసే సెనోలైటిక్ ఔషధాలపై క్లినికల్ పరిశోధన చేస్తున్నాం. ఇవి వృద్ధాప్య ఎలుకల శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా వాటి జీవితకాలాన్ని కూడా పొడిగించాయి. ఆస్టియో ఆర్థరైటిస్, అల్జీమర్స్, క్యాన్సర్‌ను జయించి, బలహీనంగా ఉన్న బోన్ మారో నుంచి రక్షించబడిన వారిని లక్ష్యంగా చేసుకుని మానవుల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

- డాక్టర్ జేమ్స్ కిర్క్‌లాండ్, నోబెర్ ఫౌండేషన్ & ఏజింగ్ రీసెర్చ్ ప్రొఫెసర్, మాయో క్లినిక్

Advertisement

Next Story

Most Viewed