Shower bothing : ప్రతిరోజూ షవర్ కింద స్నానం చేయడం మంచిదేనా?

by Javid Pasha |
Shower bothing : ప్రతిరోజూ షవర్ కింద స్నానం చేయడం మంచిదేనా?
X

దిశ, ఫీచర్స్ : రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. అయితే కొందరు వేడి నీళ్లు, మరి కొందరు చన్నీళ్లు వాడుతుంటారు. కొందరు టబ్ బాత్ చేస్తే మరి కొందరు బకెట్‌లో నీళ్లు పట్టుకొని చేస్తారు. ఇంకొందరు షవర్ కింద స్నానం చేస్తుంటారు. అయితే షవర్ కింద చేయడం ఫ్రెష్‌గా, హ్యాపీగా అనిపించవచ్చు. కానీ రోజూ అలాగే చేయడం మంచిదేనా? నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.

* షవర్ కింద స్నానం చేయడం ఉత్సాహంగా అనిపిస్తుండవచ్చు.. కానీ రోజూ చేస్తే జలుబు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. షవర్ వాటర్ నుంచి వచ్చే బ్యాక్టీరియాకు అధికంగా గురికావడంవల్ల స్కిన్ అలెర్జీలు వచ్చే చాన్స్ ఉందట. ఒకవేళ షవర్ కిందే స్నానం చేయాల్సి వస్తే స్నానం చేసే సమయం 5 నిమిషాలలోపే ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు చేస్తే శరీరానికి హాని జరగవచ్చు.

* రోజూ గంటల తరబడి షవర్ స్నానం చేసేవారిలో చర్మం పొడిబారుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా స్కిన్ గరుకుగా మారడం, నాచురాలిటీని కోల్పోవడం వంటివి జరగవచ్చు. వృద్ధులు, దివ్యాంగులకైతే ఇది అంత సురక్షితంగా కూడా ఉండదు అంటున్నారు నిపుణులు. పైగా షవర్ బాత్ వల్ల నీటి వినియోగంపై నియంత్రణ ఉండదు. నీరు వృథా అవుతుంది. కాబట్టి షవర్ కింద స్నానం చేసేవారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తు్న్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed