తాజా రొట్టెల కన్నా చల్లటి రొట్టెలు ఆరోగ్యానికి మంచిదా.. !

by Sumithra |
తాజా రొట్టెల కన్నా చల్లటి రొట్టెలు ఆరోగ్యానికి మంచిదా.. !
X

దిశ, ఫీచర్స్ : రొట్టెలు మన ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగం. సాధారణంగా గోధుమ పిండితో చేసిన రొట్టెలకు, జొన్న రెట్టెలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ గోధుమలతో పాటు మొక్కజొన్న, జొన్న, మినుములతో చేసిన రొట్టెలు కూడా ఇష్టపడతారు. ప్రజలు సాధారణంగా అల్పాహారంలో లేదా భోజనంలో రొట్టెలను తింటూ ఉంటారు. అయితే చాలా సార్లు రాత్రిపూట తయారు చేసిన రొట్టె మిగిలిపోతుంది. అప్పుడు వాటిని మూగజీవాలకు తినిపిస్తుంటారు. అయితే తాజా రొట్టె కంటే చల్లటి రొట్టె ఎక్కువ ప్రయోజనకరమైనదని నిపుణులు చెబుతున్నారు. మరి చల్లటి రొట్టెలను ఎవరు తినాలి, ఎలా తినాలి అది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

తాజా రొట్టె కంటే చల్లటి రొట్టెల్లో పోషక విలువలు ఎక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రొట్టె చేసి 10 నుండి 12 గంటలు దాటితే అందులో RS అంటే రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుందట. ఈ స్టార్చ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. 10 నుండి 12 గంటల క్రితం చేసిన రొట్టెని ఎటువంటి సందేహం లేకుండా తినొచ్చంటున్నారు.

రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏమిటి ?

రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మీ శరీరం జీర్ణక్రియ, బరువు తగ్గడం, వ్యాధి నివారణ, ఇతర విధులకు సహాయపడే ఒక రకమైన పోషకం. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం.

చల్లటి రొట్టె ఎవరు తినాలి ?

మధుమేహం : మధుమేహంతో బాధపడేవారు చల్లటి రొట్టెలను తినాలని చెబుతున్నారు. డయాబెటిక్ రోగులకు రెసిస్టెంట్ స్టార్చ్ చాలా ముఖ్యం. ఇది శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌ను అనుమతించదు.

కడుపు సమస్యలు : కడుపులో సమస్యలు ఉన్నవారు చల్లటి రొట్టెలను తినాలని చెబుతున్నారు నిపుణులు. దీన్ని తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు. ఇది కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed