Chicken: చికెన్‌ స్కిన్‌ ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Prasanna |
Chicken: చికెన్‌ స్కిన్‌ ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : సండే రాగానే అందరికి ముందు గుర్తొచ్చేది.. నాన్ వెజ్. ఆ రోజు ఎవరి ఇంట్లో నైన చికెన్, మటన్, ఫిష్ ఉంటుంది. మరి కొందరైతే వారాలతో సంబందం లేకుండా రోజూ అదే పనిగా తింటుంటారు. వాటిలో చికెన్ ఎక్కువుగా తీసుకుంటారు. దీనితో కర్రీ, చికెన్‌ 65, ఫ్రై ఇలా అనేక రకరకాలుగా చికెన్‌ తో చేసుకుని తింటారు. ఇది రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని డాక్టర్స్ దీనిని తీసుకోవాలని చెబుతుంటారు. అయితే, చికెన్‌ను స్కిన్‌తో తినవచ్చా.. లేక నార్మల్ గా తీసుకోవచ్చా అనే దానికి నిపుణులు పరిశోధనలు చేసి కొన్ని విషయాలు వెల్లడించారు అవేంటో ఇక్కడ చూద్దాం..

కోడి స్కిన్‌లో మన శరీరానికి పనికి వచ్చే పోషకాలు అసలు ఉండవు. కానీ, ఇవి చూడటానికి బావుంటాయి. ఇవి మంచి కలర్లో కనిపించడానికి కొన్ని స్ప్రే లు వాడతారు. అవి మన ఆరోగ్యంపై కొంతమేరకు ప్రభావం చూపిస్తుందని నిపుణుల పరిశోధనల్లో తేలింది. అలాగే బరువు ఎక్కువగా ఉన్న వారు నార్మల్ గా తీసుకోవడమే మంచిదని అన్నారు.

గుండె సమస్యలతో ఇబ్బంది పడే వారు చికెన్ లైట్ గా తీసుకుంటే బెటర్.. అలాగే స్కిన్ తో తీసుకోవద్దని చెబుతున్నారు. నిపుణులు చేసిన పరిశోధనల్లో చికెన్‌ స్కిన్‌ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని తేలింది. అయితే, చికెన్‌ స్కిన్‌తో తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని నిపుణులు వెల్లడించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story