Alcohol : వచ్చేది శ్రావణం.. మద్యం శాఖాహారమా, మాంసాహారమా తెలుసుకోండి మరి!

by Jakkula Samataha |
Alcohol : వచ్చేది శ్రావణం.. మద్యం శాఖాహారమా, మాంసాహారమా తెలుసుకోండి మరి!
X

దిశ, ఫీచర్స్ : శ్రావణ మాసం వచ్చేస్తుంది. అత్యంత పవిత్రమైన మాసాల్లో ఇదొకటి. ఈ శ్రావణంలో ప్రతి ఒక్కరూ శాఖాహారమే తీసుకుంటూ.. దైవారాధన చేస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో అస్సలే మాంసహారం ముట్టకూడదు అంటుంటారు. అయితే ఇంట్లో ఆడవారు ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కానీ కొందరు భర్తలు మాత్రం ఆల్కహాల్‌కు బానిసవ్వడం వలన తప్పకుండా మద్యం సేవించడానికే ఎక్కు ఆసక్తి చూపుతారు.కాగా, కొందరు అసలు ఈ శ్రావణ మాసంలో మద్యం సేవించాలంటే అది శాఖాహారమా, మాంసాహారమా అనే సందేహం కలుగుతుంది. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అందరూ చెబుతుంటారు. కానీ దానిని లెక్క చేయకుండా, ప్రతి ఒక్కరూ మద్యాన్ని సేవిస్తుంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో మందు సేవించాలంటే? మరి అది శాఖాహారమేనా అనే అనుమానం కొందరిలో కలుగుతుంది. కాగా, అసలు విషయంలోకి వెళితే.. అందుతున్న సమాచారం ప్రకారం ఆల్కహాల్ శాఖహారమేనంట, ఒక్క వైన్, బీర్ తప్పితే మిగతావన్నీ శాఖాహారమే అంటున్నారు నిపుణులు.

వైన్, బీర్లను గెల్టిన్, గ్లాస్. గుడ్లను ఉపయోగించి తయారు చేస్తారంట. మిగితా, వోడ్కా, జెన్, రమ్, టేకిలాలు తృణధాన్యాలతో తయారు చేస్తారంట. అందుకే ఇవి శాఖాహారం అంటున్నారు నిపుణులు. కానీ మద్యానికి అడిక్ట్ అయిన వారు మాత్రం వెజ్, నాన్ వెజ్ అనే విషయాలను పట్టించుకోకుండా ఎప్పుడూ డ్రింక్ చేస్తూనే ఉంటారు. ( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది దిశ దీనిని ధృవీకరించలేదు.)

Advertisement

Next Story

Most Viewed