జుట్టును చాయ్ కెటిల్‌గా మార్చేసిన హెయిర్ స్టైలిస్ట్.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |
జుట్టును చాయ్ కెటిల్‌గా మార్చేసిన హెయిర్ స్టైలిస్ట్.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా చాయ్ లవర్స్ ఎక్కువే. ముఖ్యంగా యూత్ ఏ సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా.. టీ థీమ్ ఫాలో అయిపోతే బాగుంటుందనే చర్చ జరుగుతుంది. ఈ జాబితాలోకే చేరింది ఇటాలియన్ హెయిర్ స్టైలిస్ట్ సైదేహ్ అరియాయ్. ఓ మోడల్ జుట్టును టీ పాట్ మాదిరిగా డిజైన్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో నుంచి టీ కూడా సర్వ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 3.6 మిలియన్ల వ్యూస్ రాగా ట్రెండింగ్ లో ఉంది.

కాగా ఈ విధంగా హెయిర్ స్టైల్ సెట్ చేసేందుకు ఆమె తీసుకున్న జాగ్రత్తలు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా వివరించింది. ముందుగా ఎత్తైన పోనీటైల్‌ వేసిన ఆమె... టీ పాట్ తయారు చేయడానికి మెటల్ బెండబుల్ క్రాఫ్ట్ వైర్లు వినియోగించింది. వాటిని హాట్ గ్లూ గన్ తో జిగురుగా చేసింది. మెటాలిక్ ఫ్రేమ్ సెట్ చేశాక... జుట్టును పైకి దువ్వుతూ ముడులు వేయడం ద్వారా తనకు కావాల్సిన టీ పాట్ డిజైన్ పొందింది. తర్వాత అందులో టీ నింపి కప్పులోకి తీసుకుంది. ఇక దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ' మా అమ్మను ఈ వస్తువు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు నీ నెత్తి మీద పెట్టుకో అంటుంది. ఈ హెయిర్ స్టైలిస్ట్ మదర్ కూడా అలాగే చెప్పిందేమో అందుకే ఇలా చేసింది ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story