iPhone: ఇకపై ఐఫోన్ చేతులతో కాదు కళ్లతో ఆపరేట్ చేయొచ్చు.. ఈ సెట్టింగ్స్ చేస్తే చాలు..

by Sujitha Rachapalli |
iPhone:  ఇకపై ఐఫోన్  చేతులతో కాదు  కళ్లతో ఆపరేట్ చేయొచ్చు.. ఈ సెట్టింగ్స్ చేస్తే చాలు..
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ డెవలప్మెంట్స్ రోజురోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఒక ఊరి నుంచి మరో ఊరికి ఫోన్ చేయాలంటే ముందే ఎన్ రోల్ చేసుకోవాల్సి ఉండేది. ఆ తర్వాత డబ్బా ఫోన్స్.. స్మార్ట్ ఫోన్స్.. కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇక ముందుగా ఫోన్ లాక్.. నెంబర్, ప్యాటర్న్ తో చేసేవారు. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ వచ్చేసింది. ఏది ఏమైనా.. ఏ ఫోన్ అయినా.. ఇప్పటి వరకు చేతితోనే ఆపరేట్ చేశాం. కానీ తాజాగా యాపిల్ కంపెనీ ఐఫోన్ ను కళ్లతో ఆపరేట్ చేసే సౌలభ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది.

ఈ కారణంగా Apple iOS 18 బీటా ఐ ట్రాకింగ్... గేమ్ చేంజర్ గా మారింది. ఇది మీ ఐఫోన్‌ను మీ కళ్ళతో నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీన్ని ప్రయత్నించేందుకు.. మీకుiOS ౧౮ బీటా ఉండాలి. ఫోన్ లో సెట్టింగ్స్ కు వెళ్లి.. తర్వాత యాక్సెస్‌బిలిటీ .. ఆ తర్వాత ఫిజికల్ అండ్ మోటార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఐ ట్రాకింగ్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇలా సెట్ చేసుకుని దాన్ని టోగుల్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫోన్ ను కళ్లతో కంట్రోల్ చేసేందుకు సిద్ధం అయినట్లే. కాగా ఐ ట్రాకింగ్.. ఫ్యూచర్ లో ఫోన్ వినియోగించే విధానాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed