వర్షాకాలంలో రోగాల వ్యాప్తి.. హైబ్రిడ్ దోమతో చెక్ పెట్టనున్న శాస్త్రవేత్తలు..

by Sujitha Rachapalli |
వర్షాకాలంలో రోగాల వ్యాప్తి.. హైబ్రిడ్ దోమతో చెక్ పెట్టనున్న శాస్త్రవేత్తలు..
X

దిశ, ఫీచర్స్: వర్షా కాలం వచ్చిందంటే చాలు దోమల సంఖ్య పెరుగుతుంది. రోగాల విజృంభణ మొదలవుతుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జికా, ఎల్లో ఫీవర్.. ఇలా నంబర్ ఆఫ్ డిసీజెస్ ఎటాక్ చేయడం మొదలుపెడతాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ దోమల కారణంగానే వస్తుండగా.. వీటి వ్యాప్తిని అరికట్టేందుకు చక్కని సొల్యూషన్ తో వచ్చారు శాస్త్రవేత్తలు. దోమలను ఇంటర్ సెక్స్ గా మార్చడం ద్వారా అంటే.. ఆడ, మగ అని గుర్తించబడకుండా ఉండేలా చేస్తే దోమలను పూర్తిగా అరికట్టవచ్చని గుర్తించారు. ప్రపంచాన్ని దోమల పీడ నుంచి విముక్తి కలిగించవచ్చని అన్నారు.

ఇప్పటికే ఈడెస్ మస్కరెన్సిస్‌, ఈడెస్ ఈజిప్టి దోమల మధ్య హైబ్రిడైజేషన్ మగ లింగ నిర్ధారణకు విఘాతం కలిగిస్తుందని గుర్తించారు. అంటే దోమలు జన్యుపరంగా మగ అయినప్పటికీ.. మిశ్రమ లింగాలని కలిగి ఉంటాయి. డెంగ్యూ వంటి గ్లోబల్ ఆర్బోవైరల్ వ్యాధులకు ఈడెస్ ఈజిప్టి ఒక ప్రాథమిక వెక్టర్. కాగా ఈడెస్ మాస్కరెన్సిస్ హిందూ మహాసముద్రం నుంచి వచ్చింది. కాగా వీటిమధ్య హైబ్రిడైజేషన్ కారణంగా

దాదాపు 10 శాతం సంతానం ఇంటర్‌సెక్స్‌గా మారిందని.. ఈ హైబ్రిడ్ దోమలు మరో

ఆడ దోమతో పునరుత్పత్తి చేయలేక పోయాయని పరిశోధన తెలిపింది. ఈ ఇంటర్ సెక్స్ టెక్నిక్ మగ సంఘాలను సృష్టించడానికి.. ఆడ దోమలను పూర్తిగా నిర్మూలించేందుకు హెల్ప్ అవుతుంది. అన్ని రకాల వ్యాధులను అరికట్టేందుకు సాయపడుతుంది. ఈ కొత్త పద్ధతి పురుగుమందులకు ప్రత్యామ్నాయాన్ని కూడా అందించవచ్చు.

Advertisement

Next Story