ఇంట్రెస్టింగ్ : శానిటరీ ప్యాడ్స్ మొదట మగవారికే తయారు చేశారంట.. కానీ

by Disha Web Desk 8 |
ఇంట్రెస్టింగ్ : శానిటరీ ప్యాడ్స్ మొదట మగవారికే తయారు చేశారంట.. కానీ
X

దిశ, ఫీచర్స్ : పీరియడ్స్ అంటే అందరికీ అమ్మాయిలే గుర్తు వస్తారు. దీని గురించి చర్చించడానికి కూడా చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా అబ్బాయిలు..శానటరీ ప్యాడ్స్ గురించి తీయగా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. కానీ మొదటగా వీటిని వారి కోసమే తయారు చేశారు అన్న విషయం వారు తెలుసుకోలేరు. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ భూమి మీద ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే అవునా .. నిజమా అని ఆశ్చర్యపోక తప్పదు. అందులో ఈ విషయం కూడా ఒకటి. స్త్రీలు ఇప్పుడు వాడే ఈ శానిటరీ ప్యాడ్స్‌ను మహిళల కోసం కాకుండా పురుషుల కోసం తయారు చేశారంట. అయితే వారు వీటిని ఎలా ఉపయోగించేవారు? అసలు మగవారి కోసం ఇవి ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికన్ శాస్త్రవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొదటగా ఈ శఆనిటరీ ప్యాడ్‌ను కనిపెట్టాడంట. ఐరోపాలో యుద్ధం జరుగుతున్న సమయంలో ఫ్రెంచ్ సైనికులకు తీవ్రంగా గాయాలు అయ్యి వారికి అధికంగా రక్తస్రావం అయ్యేదంట. దీంతో రక్తాన్ని పీల్చే పదార్థాన్ని బెంజమిన్ కనిపెట్టిన ఈ ప్యాడ్స్ వారికి గాయపడిన చోట కట్టేవారు. అలా పురుషులు ఈ శానిటరీ ప్యాడ్స్ వాడే వారు. అయితే కొంత మంది అమెరికా నర్సులు సైనికులకు సేవలు అందించడానికి వచ్చిన క్రమంలో వారికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ శానిటరీ ప్యాడ్ వినియోగించడం మొదలు పెట్టారు. అది వారికి చాలా కంఫర్ట్‌గా అనిపించడంతో దానిని అమెరికాకు తీసుకెళ్లారు. అలా మహిళలంతా ఈ శానిటరీ ప్యాడ్ వాడే కల్చర్ వచ్చింది.

Next Story

Most Viewed