- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూరిస్టు బస్సులో మంటలు: 8 మంది సజీవ దహనం
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని నూహ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జర్నీలో ఉన్న టూరిస్టు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్, చండీగఢ్‌కు చెందిన సుమారు 60 మంది గత వారం రోజులుగా అనేక తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తిరిగి వస్తుండగా నుహ్ జిల్లా సమీపంలోని కుండ్లీ-మనేసర్-పల్వాల్ రహదారి వద్దకు రాగానే బస్సులో అకస్మా్త్తుగా మంటలు వచ్చాయి. దీంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..24 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంటలకు అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికులు బస్సు కిటికీలు పగులగొట్టి కొంత మంది ప్రయాణికులను బయటకు తీసినట్టు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు.