ఛీ ఛీ ఆ గలీజు పని చేయడానికి రూ. కోటి ఎక్స్ట్రానా.. స్టార్ హీరోయిన్‌పై ఫ్యాన్స్ ఫైర్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-18 05:09:54.0  )
ఛీ ఛీ ఆ గలీజు పని చేయడానికి రూ. కోటి ఎక్స్ట్రానా.. స్టార్ హీరోయిన్‌పై ఫ్యాన్స్ ఫైర్!
X

దిశ, సినిమా : మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహానటి సావిత్రి సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాతం పెరిగిపోయింది. అప్పటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తు వచ్చిన ఈ బ్యూటీ తర్వాత స్టార్ సినిమాల్లో అవకాశాలు అందుకొని మంచి హిట్స్ అందుకొంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. దీతో ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ వచ్చాయి. నేనులోకల్, ఆజ్ఞాత వాసి, సరైనోడు ఇలా చాలా సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు. దీంతో ఈ నటి బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ మైదాన్ సినిమాలో నటించి హిట్ అందుకోవడంతో ఆమెకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ వస్తున్నాయంట.

అయితే తెలుగులో కీర్తి చాలా పద్ధతిగా కనిపించిన విషయం తెలిసిందే. కానీ బాలీవుడ్‌లోకి వెళ్లాక ఈ అమ్మడు స్టైల్ మొత్తం చేంజ్ చేసిదంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్లో కూడా నటించడానికి ఒప్పుకున్నదంట ఈ చిన్నది. రుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా ఈ సినిమాలో ముద్దు సీన్స్ లో కూడా నటిస్తాను అంటూ ఓకే చేసిందట. అయితే పాపం కీర్తిని దర్శకుడు చాలా బలవతం చేశాడు.. ఆ సీన్ చేయమని అని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తూ ఈ నటి ఆసీన్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. కీర్తి ఏంటీ ఇలా మారిపోయింది. అన్ని రోతపనులే చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story