EAP CET : నేడు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల

by Rajesh |
EAP CET : నేడు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నెల 7 నుంచి 11 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ‌హెచ్‌లో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, ఇంజినీరింగ్ విభాగంలో 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 90 శాతం మంది పరీక్ష రాశారు.

Advertisement

Next Story

Most Viewed