- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Karimnagar : ఆదాయం కోసం కాంట్రాక్టర్ అవతారం..కమీషన్ల కోసం అభివృద్ధి పనులు
దిశ బ్యూరో, కరీంనగర్ : పారదర్శకంగా పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవసరాల కోసం అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తూ అందిన కాడికి దోచుకునేందుకు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తుతున్నారు. పర్యవేక్షించాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్ల రూపాయలను దారిమళ్లీస్తున్నారు. కళాభారతి పేరిట అవసరం లేని పనులకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ ఖజానా ఖాళీ చేస్తున్నారు. అక్రమాలకు కేరాఫ్ గా నిలుస్తున్న కరీంనగర్ మున్సిపల్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది.
కమీషన్ల కోసం కళాభారతి..
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణమై ఉన్న కళాభారతి శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వంలోని పాలకులు స్మార్ట్ సిటీ నిధులతో స్థానిక ఎస్ ఆర్ ఆర్ కాలేజీ ఆవరణలో నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఆ భవనానికి కళాభారతికి బదులు అమృత వర్షిణి మినీ రవీంద్రభారతి గా నామకరణం చేసి అందుకు స్మార్ట్ సిటీ నిధుల నుండి రూ.12 కోట్ల 75 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టరుకు పనులను అప్పగించారు. ఆ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. అయితే ఆ భవనానికి నిధులు చెల్లించి కాంట్రాక్టర్ తో పనులు పూర్తి చేయించాల్సిన అదికారులు అటు ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను పక్కదారి పట్టించి కళాభారతి పునరుద్ధరణ కు శ్రీకారం చుట్టడం కరీంనగర్ కార్పొరేషన్ లో కలకలం రేపుతుంది. కమీషన్ల కోసమే అధికారులు ప్రభుత్వాన్ని పాలకులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమీషన్ల కోసం అభివృద్ధి పనులు.. ఆదాయం కోసం కాంట్రాక్టర్లుగా అధికారులు
పారదర్శకంగా పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రభుత్వాన్ని పాలకులను పక్కదారి పట్టిస్తున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ పనులు రూపొందిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టేస్తున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులే సూత్రధారులు గా వ్యవహరిస్తూ పనులు రూపకల్పన చేయడంతో అటు ఖద్దరు నేతలు ఇటు కాంట్రాక్టర్లు ఎవరి వాటా వారికి చేరుతుందనే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందుకు ఒక అడుగు ముందుకు వేసిన అధికారులు ఇప్పుడు పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న... కాంట్రాక్టర్ పేరుతో నామినేషన్ పద్దతిలో పనులు కేటాయించడం ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. కూలీలు చేయాల్సిన పనులను సైతం కార్పొరేషన్ సిబ్బందితో చేయించడంతో కాంట్రాక్టరు పనులు చేస్తున్నారా లేక అదికారులే కాంట్రాక్టరు పేరుతో పనులు చేపిస్తున్నారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వివాదాస్పదంగా కార్పొరేషన్ అధికారి వ్యవహరం..
సంవత్సరాల తరబడి కరీంనగర్ కార్పొరేషన్ లో విధులు నిర్వహించి కొంతకాలం ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి ప్రమోషన్ పై కరీంనగర్ కార్పొరేషన్ కు వచ్చిన ఓ ఇంజనీరింగ్ అధికారి వ్యవహారం కరీంనగర్ కార్పొరేషన్ లో కలకలం రేపుతుంది. గత పరిచయాలు ప్రస్తుతం పెరిగిన హోదా తో ఇప్పుడు ఆ అధికారి వ్యవహారానికి అడ్డూ అదుపు లేకుండా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏకంగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులనే బ్లాక్ మేయిల్ చేస్తున్నాడని తన వ్యవహారం కొనసాగించేందుకు ఉద్యోగులతో జేఏసీ ఏర్పాటు చేసి కింది స్థాయి సిబ్బందిని తన చెప్పుచేతల్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇక్కడ అభివృద్ధి పనులన్నీ ఇంజనీరింగ్ విభాగం సమక్షంలో నడవడం కాంట్రాక్టర్లు ఖద్దరు నేతలు తమ కమీషన్లకోసం కక్కుర్తి పడటంతో ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కరీంనగర్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కలెక్టర్ ఆదేశాల మేరకే పునరుద్ధరణ పనులు, అవకతవకలకు ఆస్కారం లేదు : మున్సిపల్ ఈఈ రోడ్డ యాదగిరి
కళాభారతి పునరుద్దరణ పనులు కలెక్టర్ ఆదేశం మేరకే కొనసాగుతున్నాయి. అందులో ఎలాంటి అవకతవకలను ఆస్కారం లేదు. కొందరు పడని వ్యక్తులు మా పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆరోపణల్లో నిజం లేదు. జేఏసీ అనేది ఉద్యోగుల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు కాదు. గతంలో నిర్మాణం చేపట్టిన మినీ రవీంద్ర భారతి ఆడిటోరియం పనులు నిధులు లేక నిలిచిపోయాయి. కార్పొకేషన్ అధికారులు గతంలో కళాభారతిని గోడౌన్ లాగా వాడుతున్నారు. అందుకే కళాభారతిని పునరుద్ధరణ చేసి శాశ్వతంగా వాడుకలోకి తెచ్చేందుకే రూ.15 లక్షలు నిధులు కేటాయించి కాంట్రాక్టర్ కు నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించాం. కొన్ని పనులు ప్రభుత్వం పై అదనపు భారం పడకుండా ఉండేందుకు మున్సిపల్ సిబ్బందితో చేపించాం.