- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంట్రెస్టింగ్ న్యూస్.. మేక లేకపోతే కాఫీనే పుట్టేది కాదంట!
దిశ, ఫీచర్స్ : అప్పటికప్పుడు మంచి ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్‌లలో కాఫీ ఒకటి. కాఫీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది ఎంతో ఇష్టంగా దీనిని తాగుతూ ఉంటారు. కాఫీ తాగడం వలన ఒత్తిడి తగ్గడమే కాకుండా, మనసుకు చాలా హాయిగా ఉంటుంది అంటారు కాఫీ ప్రియులు. అందుకే వారికి కాఫీ తాగనిదే రోజు గడవనట్లు ఉంటుంది అంటారు. అయితే అంతగా ఇష్టపడే కాఫీ ఎక్కడ ఎలా పుట్టిందో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ కాఫీ మీకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసా? కాఫీ అనేది మేక నుంచి పుట్టుకొచ్చిదంట.దీనిని మొదట 8వ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారంట. అయితే ఓ మేకల కాపరి కల్దీ, రోజూ మేకలను మేపుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు తన మేక పిల్ల చాలా చురుకుగా ఉండటం గమనించి, అది రోజూ ఏం మేస్తుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. అయితే ఆ మేకపిల్ల అడవిలో ఓ మొక్క నుంచి వచ్చే గింజలను ఎంతో ఇష్టంగా తినడం చూసి, తమ ఊరి పెద్దలను పిలిచి, మా మేక పిల్లలు ఈ గింజలను తిని చాలా యాక్టివ్‌గా ఉంటున్నాయి. అని చెప్పాడు. దీంతో ఆ గింజలను తెచ్చి పౌడర్ చేసి దానిని తాగమని చెప్పగా ఎవరూ దానికి సాహసించలేదు. చివరకు మేకల కాపరినే ఆ డ్రింక్ తాగాడు. అది చాలా రుచిగా ఉండటమే కాకుండా, తాగాక చాలా చురుకుగా అనిపించడంతో, ఆ గ్రామస్థులందరూ ఆ గింజలను సేకరించి ఇంట్లో పౌడర్ చేసుకొని తాగడం మొదలు పెట్టారు. అలా మేకతో మొదలైన కాఫీ ప్రయాణం, ఎల్లలు దాటి అరేబియా దేశాలకు పాకింది. అక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు చేరింది. ఇంతకీ ఆ మేకలు తిన్న గింజలు ఏమిటో తెలుసా? కాఫీ బీన్స్. అలా కాఫీ అనేది మేక నుంచి పుట్టుకొచ్చింది అంటున్నారు నిపుణులు.