- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heart Stroke : స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్న నిద్రలేమి.. 50 ఏళ్లలోపు వారిలోనే అధికం
దిశ, ఫీచర్స్: నిద్రలేమి సమస్యతో బాధ పడే 50 ఏళ్లలోపు వారిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని రిచ్‌మండ్‌లోని వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. గత తొమ్మిదేళ్లుగా ఎటువంటి స్ట్రోక్ చరిత్ర లేని 31,000 మందిని పరిశీలించడం ద్వారా నిపుణుల ఈ విషయాన్ని కనుగొన్నారు. నిద్రలేమితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులలో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంటుదని తెలిపారు. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే ఇతర కారకాలు నియంత్రించిన తర్వాత, నిద్రలేమికి సంబంధించిన 5 నుంచి 8 లక్షణాలతో ఉన్న వ్యక్తులను కూడా పరిశోధకులు స్టడీ చేశారు. వీరిలో నిద్రలేమి సమస్య లేని వారితో పోల్చితే, ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం 51 శాతం ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.
కేవలం ఒకటి నుంచి నాలుగు నిద్రలేమి లక్షణాలు కలిగిన వారిని పరిశీలించినప్పుడు, నిద్రలేమి లేనివారితో పోల్చినప్పుడు ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. మరొక అధ్యయనంలో 4,500 మంది నుంచి సేకరించిన డేటాను కూడా విశ్లేషించడం ద్వారా ఇవే ఫలితాలను నిపుణులు కనుగొన్నారు. నాణ్యతలేని నిద్ర బ్లడ్ ప్రెషర్‌ను పెంచుతుందని, దీర్ఘ కాలికంగా కొనసాగితే స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. అయితే నిద్రలేమి సమస్య ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని, దానిని త్వరగా అధిగమించడం, చికిత్స తీసుకోవడం ద్వారా రిస్కు తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
Read more: ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట
గర్భ నిరోధక మాత్రల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్.. ఏం చేయాలో తెలుసా?