- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
insecurity : ఆ విషయంలో వెంటాడుతున్న అభద్రత.. రోజుకు 5 సార్లు..
దిశ, ఫీచర్స్ : చదువులో, వృత్తిలో, పనిలో, ప్రయత్నంలో ఇలా సందర్భం ఏదైనా కావచ్చు కానీ ఇటీవల చాలా మంది అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. మార్నింగ్ నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే సగటు వ్యక్తి రోజుకు రెండు నుంచి ఐదుసార్లు అసౌకర్యంగా ఫీలవున్నారని, అసౌకర్యంగా భావిస్తున్నారని కురాడ్ అండ్ వన్‌పోల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. తమ తమ పనుల్లో ప్రజలు ఎలా నిమగ్నం అవుతున్నారు. వారి కాన్ఫిడెంట్ లెవల్స్ ఏ మేరకు ఉంటున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి నిపుణులు పలువురిని అబ్జర్వ్ చేశారు. అయితే చాలామందిని ఏదో ఒక సందర్భంలో ఇన్ సెక్యూర్ ఫీలింగ్ వెంటాడుతోందని, పలు విషయాల్లో తమను తాము వెంటనే విశ్వసించడానికి కష్టపడుతున్నారని ఈ సందర్భంగా నిపుణులు గుర్తించారు. అయితే ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ ఏ సందర్భంలో ప్రజలను వెంటాడుతున్నాయో చూద్దాం.
ఆఫీసులో లేదా ఒక పెద్ద సమూహంలో ఉన్నప్పుడు 40 శాతం మంది ఒక్కసారైనా అభద్రతా భావాన్ని అనుభవిస్తున్నారట. అలాగే చేస్తు్న్న పనికి ప్రిపేర్ కాకపోవడంవల్ల 34 శాతం మంది, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు 28 శాతం మంది ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నారు. మొదటిసారి డేటింగ్ యాప్‌ను యూజ్ చేసినప్పుడు 27 శాతం మంది. ఆఫీసుకు లేదా మీటింగ్‌కు ఇతర కొలీగ్స్ కంటే లేటుగా రావడంవల్ల 22 శాతం మంది అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు సర్వే పేర్కొన్నది. అభద్రతా భావం, అసౌకర్యం తాము కావాలని ఫీలయ్యే సమస్యలు కావని, పరిస్థితుల మధ్య అలా రియాక్ట్ అవుతుంటామని బాధితులు అభిప్రాయపడుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఆలోచనలు మార్చుకోవడం, సొంత ఉపాయాలతో ఆత్మ విశ్వాసాన్ని తిరిగి పొందడం వంటి ఆచరణాత్మక చర్యలవల్ల ప్రజలు అభద్రత, అసౌకర్యం వంటి భావాల నుంచి బయపట పడుతున్నారట.
అయితే 48 శాతం మంది పాజిటివ్ మైండ్ సెట్‌ను అడాప్ట్ చేసుకోవడం ద్వారా అభద్రత భావాన్ని అధిగమిస్తున్నారు. మరో 46 శాతం మంది కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు, అభిమానుల మద్దతుతో ఇబ్బందికర పరిస్థితులను అధిగమిస్తున్నారు. కాగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండే అలవాటువల్ల 43 శాతం మంది ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకొని అభద్రతను అధిగమిస్తున్నారు. వర్క్ టాస్కులను పూర్తి చేయడంవల్ల 39 శాతం మంది, ఇతరులకు హెల్ప్ చేయడంవల్ల 31 శాతం మంది తమ కాన్ఫిడెంట్ లెవల్స్‌ను తిరిగి పొందుతున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొంటున్నారు.