- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CES 2024 : గాలిలో ఛార్జింగ్ అయ్యే మొబైల్ .. ఆహారం వేడి చేసే బ్యాగ్ ఎప్పుడైనా చూశారా..
దిశ, ఫీచర్స్ : ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రముఖ టెక్ కంపెనీలు CESలో కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టాయి. ఇందులో భాగంగానే ఇన్ఫినిక్స్ ఎయిర్‌ఛార్జ్ టెక్నాలజీని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే విల్ టెక్స్ అనే జపాన్ కంపెనీ నిమిషాల్లో ఆహారాన్ని వేడి చేసే బ్యాగ్ ని ప్రవేశపెట్టారు. వింటుంటే కాస్త వింతగా ఉన్నాయి కదా. మరి వాటి వివరాలు తెలుసుకుందాం..
AI ఎయిర్ ఛార్జింగ్..
ఇన్ఫినిక్స్ మొబైల్ తయారీదారు Infinix CES 2024 లో అద్భుతమైన సాంకేతికతను ఆవిష్కరించింది. AI ఎయిర్‌ఛార్జ్ టెక్నాలజీని పరిచయం చేసింది. భవిష్యత్తులో కంపెనీ ఈ టెక్నాలజీని వినియోగదారులకు అందిస్తే, మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి మీకు కేబుల్ లేదా వైర్‌లెస్ ప్యాడ్ అవసరం లేకుండా పోతుంది.
ఈ టెక్నాలజీ మల్టీ కాయిల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఫీచర్ సహాయంతో 20 సెం.మీ దూరంలో ఉన్న ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంది. ఇన్ఫినిక్స్ ఈ సాంకేతికతను ఎప్పుడు వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుందో చూడాలి.
ఈ బ్యాగ్ నిమిషాల్లో ఆహారాన్ని వేడి చేస్తుంది
బయటికి వెళ్లినప్పుడు ఆహారం చల్లగా అయిపోతుంది. ప్రయాణంలో మీ ఆహారం ఎలా వేడిగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇందుకోసమే విల్ టెక్స్ అనే జపాన్ కంపెనీ విల్ కుక్ బ్యాగ్‌ని పరిచయం చేసింది. ఈ బ్యాగ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, ఈ బ్యాగ్‌లో ఉంచిన ఆహారం కేవలం 5 నిమిషాల్లో 80 డిగ్రీల వరకు వేడెక్కుతుంది.
ఈ బ్యాగ్ ఛార్జ్ చేయాలి, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ బ్యాగ్ మీకు 8 గంటల పాటు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాగ్ లో ఆహారం రెండు గంటలపాటు వేడిగా ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ బ్యాగ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే సమాచారం కొద్ది రోజుల్లో తెలియనుంది.