Dating trends : ఫ్రెండ్‌‌షిప్ మ్యారేజ్.. జపనీస్ యూత్‌లో ఏమిటీ నయా డేటింగ్ కల్చర్ !

by Javid Pasha |
Dating trends : ఫ్రెండ్‌‌షిప్ మ్యారేజ్.. జపనీస్ యూత్‌లో ఏమిటీ నయా డేటింగ్ కల్చర్ !
X

దిశ, ఫీచర్స్ : లవ్ మ్యారేజ్, అరైంజ్డ్ మ్యారేజ్, రిజిస్ట్రేషన్ మ్యారేజ్‌ల గురించి మనం తరచూ వింటుంటాం. కానీ మీరెప్పుడైనా ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ గురించి విన్నారా? ప్రస్తుతం ఇది జపాన్‌లో నడుస్తున్న ఈ నయా ట్రెండ్. వాస్తవానికి వివాహం అనేది స్త్రీ, పురుషుడు కలిసి జీవించడానికి ఉద్దేశించినది. ఇక్కడ రెండు మనసులు మాత్రమే కాదు, రెండు శరీరాల కలయిక ఉంటుంది. లివ్‌ఇన్ రిలేషన్ షిప్, డేటింగ్ కల్చర్‌లోనూ వారి ఇష్టాయిష్టాలను బట్టి ఫిజికల్ రిలేషన్ కలిగి ఉండవచ్చు. కానీ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ మాత్రం అందుకు భిన్నం. అదెలాగో తెలుసుకుందాం.

జపనీస్ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ను నయా డేటింగ్ కల్చర్‌గా పలువురు పేర్కొంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డేంటింగ్ కల్చర్‌కు, దీనికి చాలా తేడా ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో స్త్రీ, ఒక పురుషుడు కలిసి ఒకే ఇంటిలో లేదా ఒకే రూములో కలిసి జీవిస్తుంటారు. పరస్పర గౌరవ భావంతో మెలుగుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే భార్యా భర్తల్లా అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటారు. కానీ దంపతుల మాదిరి లోతైన ప్రేమ, రొమాన్స్ వంటివి అస్సలు ఉండవట. కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంటుంది. ఇక పిల్లలు కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవచ్చు లేదా కృత్రిమ పద్ధతిలో గర్భధారణ ద్వారా పిల్లల్ని పొందవచ్చునట. మరో విషయం ఏంటంటే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో భాగస్వాముల మధ్య శృంగారపరమైన సంబంధం ఉండదు. కాబట్టి వారు తమకు నచ్చితే వేరేవాళ్లతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఉందట. అలా పెట్టుకున్నప్పటికీ వీళ్లద్దరు మాత్రమే కలిసి జీవిస్తారు.

Advertisement

Next Story

Most Viewed