Lightning Strikes ను ఆపిన సైంటిస్టులు.. లేజర్ లైటింగ్‌తో సాధ్యం

by sudharani |   ( Updated:2023-01-21 10:14:09.0  )
Lightning Strikes ను ఆపిన సైంటిస్టులు.. లేజర్ లైటింగ్‌తో సాధ్యం
X

దిశ, ఫీచర్స్: పిడుగుపాటుతో ప్రతీ ఏటా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తూనే ఉంది. శాటిలైట్ నిర్వాహకుల రిపోర్ట్ ప్రకారం పిడుగుపాటు వల్ల ఏటా పది బిలియన్ డాలర్ల విలువైన నష్టం కలుగుతోంది. నాలుగు వేల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే పిడుగుపాటును వెనక్కి నెట్టేందుకు, ప్రజలను రక్షించుకునేందుకు.. 18వ శతాబ్దం నుంచే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. సైంటిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇందుకోసం మెటల్ రాడ్స్‌ను ఉపయోగించాడు. కానీ నివాసాలకు చాలా దూరంలో ఉండటం వలన ఫలితం లేకుండా పోయింది. 2004లోనూ లేజర్స్ ఉపయోగించి పిడుగుపాటును ఆపాలనుకున్నారు. కానీ ఫలించలేదు.

అయితే తాజాగా జర్మనీకి చెందిన ట్రంఫ్ అండ్ టీం ఒక కారు సైజు పరిమాణం గల శక్తిమంతమైన లేజర్‌లను రూపొందించి, దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ లేజర్ పరికరం కనీసం ఐదు టన్నుల బరువుతో సెకనుకు 1,000 కార్లను కాల్చగలిగే శక్తి కలిగి ఉంటుంది. దీనిని గత సంవత్సరం జూలై, సెప్టెంబర్ నెలల మధ్య సైంటిస్టుల బృందం పిడుగులు పడే క్రమంలో వాటిని వెనక్కి నెట్టేందుకు ఆరు గంటలకుపైగా ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని చాలా కిలోమీటర్ల దూరంలో ఉంచిన హై స్పీడ్ కెమెరాలతో రికార్డు చేశారు.

రెండు వేర్వేరు హై స్పీడ్ కెమెరాల ద్వారా 50 మీటర్ల దూరం నుంచి పైకి లేజర్ లైటింగ్‌ను పంపించి, పిడుగుపాటును అడ్డుకునే పరిశోధనలు జరిపారు. ఒక విధంగా చెప్పాలంటే లేజర్ పిడుగులను అడ్డుకునే లేదా దారిని మళ్లించే అపోజిట్ వర్చువల్ పిడుగు లాంటిదేనని నిపుణులు చెప్తున్నారు. ఇందుకోసం భారీ విద్యుత్ డిశ్చార్జెస్‌ను 30 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు, అంటే.. సూర్యుని ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడి, శక్తివంతం కలిగిన లేజర్‌ను ప్రయోగించారు. ఈ డిశ్చార్జెస్ ఎటువంటిదంటే.. మేఘాలు, భూమి మధ్య ప్రతికూల, సానుకూల ప్రభావాలను చూపగలదు.

కాగా ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని దాదాపు 8,200 అడుగుల ఎత్తులో గల సాంటిస్ పర్వతంపై ఈ పరిశోధనను సైంటిస్టులు నిర్వహించారు. ఏటా దాదాపు వందసార్లు పిడుగుపాటుకు గురవుతున్న ఈ ప్రాంతం.. ఐరోపాలో అత్యధికంగా పిడుగుపాటుకు గురైన ప్రదేశాల్లో ప్రధానంగా ఉంది.

ఇవి కూడా చదవండి :

కాంతి కాలుష్యం వల్ల నక్షత్రాలు కనుమరుగవుతాయా ?

NewsPaper అంటే ఏమిటి..?

Advertisement

Next Story