- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోస్ డే.. గులాబీతో ప్రపోజ్ చేయాలా.. ఏ రంగు దేనికి సంకేతమో తెలుసుకోండి?
దిశ, ఫీచర్స్ : రోజా రోజా.. రోజా నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయి తిరిగివచ్చా.. అనే సాంగ్ అందరికీ గుర్తు ఉంటుంది. ప్రేమికులకు సుపరిచితమైనది ప్రేమికుల రోజు మూవీలోని ఈ పాట. వాలెంటైన్స్ వీక్ మొదలైంది. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఈనెల 7న రోస్ డేతో వాలెటైన్ వీక్ మొదలవుతుంది.
ఇక అందమైన గులాబీతో తన మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. ప్రేమను చెప్పడానికి మాటలు సరిపోవు అంటారు. అలాగే ఒక వ్యక్తి మీద ఉన్న ఇష్టాన్ని రంగు రంగుల గులాబీలతో చెబుతుంటారు. అయితే ఒక్కో రంగు గులాబి ఒక్కో విధమైన భావాలను వ్యక్తం చేస్తుందంట. కాగా, ఏ రంగు గులాబీ దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుపు గులాబీ : తెలుపు రంగు గులాబీ స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తాయంట. అయితే మీ ప్రేయసికి ఈ రంగు గులాబీని ఇవ్వడం ద్వారా మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే తొలిగిపోతాయని అర్థం అంట.
రెడ్ కలర్ గులాబీ : ఎరుపు రంగు గులాబీ ప్రేమకు చిహ్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎర్ర గులాబీని ఇస్తారంట.
పింక్ గులాబీ : ఈ రంగు గులాబీ సంరక్షణ, ప్రేమను సూచిస్తుంది. ఈ గులాబీ ఆనందం, కృతజ్ఞత, సంబంధం అందాన్ని సూచిస్తుంది.
పసుపురంగు గులాబీ : పసుపు రంగు గులాబీ స్నేహానికి గుర్తుగా ఇస్తారు. ఇద్దరి మధ్య ఆనందాన్ని సూచిస్తుందంట.
ఆరెంజ్ గులాబీ : ఆరెంజ్ కలర్ గులాబీ అభిరుచికి చిహ్నం. జంటలు తమ ప్రేమలో అభిరుచిని సూచించడానికి ఆరెంజ్ గులాబీలను ఇవ్వవచ్చు.
- Tags
- Rose Day