పిప్పి పన్ను సమస్య వెంటనే తగ్గాలంటే .. అయితే ఇలా చేయండి

by Prasanna |   ( Updated:2023-07-31 06:01:01.0  )
పిప్పి పన్ను సమస్య వెంటనే తగ్గాలంటే .. అయితే ఇలా చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది పిప్పి పన్ను సమస్యతో చాలా బాధ పడుతుంటారు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఈ సమస్య వలన ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు. పిప్పి పన్ను వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఎలాంటి ఆహార పదార్ధాలను తీసుకోలేము. అయితే ఈ పిప్పి పన్ను సమస్య తలెత్తడానికి గల ప్రధాన కారణం నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా. మనం తీసుకునే ఆహారం మన నోట్లో పేరుకుపోయినప్పుడు చెడు బ్యాక్టీరియాగా తయారయ్యి పిప్పి పన్ను సమస్యగా మారతుంది. అందుకే మన దంతాలపై గార పోగొట్టుకోవడానికి, పిప్పి పన్ను సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రక రకాల టూత్ పేస్ట్ లు వాడుతుంటారు. తక్కువ ఖర్చుతో సహజంగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చట. అదేంటో ఇక్కడ చూద్దాం..

ఈ సమస్యను బత్తాయి పండుతో తగ్గించుకోవచ్చు. అలా అని బత్తాయి జ్యూస్ లా తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. బత్తాయి తొనలను నమిలి తింటేనే మనం ఈ ఫలితాన్ని పొందగలము. ఎందుకంటే దీనిలో ఉండే ఆమ్లత్వం నోట్లో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను తొలగించి, దంతాలు పుచ్చిపోకుండా చేస్తుంది. అంతే కాకుండా దీనిలో ఉండే ఫైబర్ దంతాలపై ఉండే గారను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

Also Read: వాళ్లకు బెండకాయతో ముప్పు.. తినకుండా ఉంటే మంచిది?

Advertisement

Next Story