వీటిని తీసుకుంటే.. ముఖంపై తెల్లమచ్చలకు చెక్ పెట్టొచ్చు!

by Prasanna |
వీటిని తీసుకుంటే.. ముఖంపై తెల్లమచ్చలకు చెక్ పెట్టొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ముఖ్యంగా మహిళలు తమ చర్మ సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మొటిమలు, తెల్ల మచ్చలు, ముడతలు నివారణకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఫేస్ ప్యాక్ లతో అనేక ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ, కొంతమందికి కొన్ని విటమిన్లు లేకపోవడం వల్ల వయస్సు మచ్చలు ఏర్పడతాయి. దీనినే పిగ్మెంట్ అంటారు. యవ్వనంగా ఉన్నా పెద్ద వారిలా కనిపిస్తారు.

మరి కొంతమంది డబ్బు ఖర్చు చేసి కాస్మోటిక్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది తమ ముఖాలు చూపించడానికి కూడా ఇష్టపడరు. మరి కొంతమంది ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖాన్ని కవర్ చేసుకుని వెళ్తారు.

అలాంటి వ్యక్తులు లేపనాలు లేదా చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకుండా చర్మం లోపాలను సులభంగా తొలగించవచ్చు. రోజూ 10 బాదంపప్పులను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. అధికంగా తీసుకుంటే గుండె సంబధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

బాదంపప్పులో విటమిన్ ఇ, అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఈ మచ్చలను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బాదంపప్పును సమతుల్యంగా తీసుకోవడం వల్ల తెల్ల మచ్చలను తొలగించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed