Skipping breakfast : బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే జ్ఞాపకశక్తిపై ప్రభావం..! ఇంకా ఏం జరుగుతుందంటే..

by Javid Pasha |   ( Updated:2024-09-09 10:49:18.0  )
Skipping breakfast : బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే జ్ఞాపకశక్తిపై ప్రభావం..! ఇంకా ఏం జరుగుతుందంటే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చాలామంది ఉదయంపూట బ్రేక్‌ ఫాస్ట్ చేస్తుంటారు. అయితే కొందరు గృహిణులు, వివిధ పనుల్లో నిమగ్నమయ్యేవారు సమయం లేకనో, ఒకేసారి లంచ్ చేద్దాం లే అనుకోవడంవల్లనో దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇకొందరు బరువు తగ్గాలని ఉదయంపూట టిఫిన్ చేయడం మానేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఒక నెలపాటు గనుక ఇది కొనసాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

* మీరు ఆ రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే చక్కటి పోషకాలు కలిగిన బ్రేక్ ఫాస్ట్ తప్పక తినాలి. కానీ బరువు తగ్గాలనో, ఇంకేదో కారణాలవల్లనో దీర్ఘకాలంపాటు మానేస్తే గనుక జీవక్రియలో ప్రతికూల మార్పులకు దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మెదడు సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఉదయం తినడం అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా పెరగవచ్చు.

* న్యూట్రిషన్ జర్నల్ స్టడీ ప్రకారం.. దీర్ఘకాలంపాటు బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉండేవారిలో భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడంలో బ్రేక్ ఫాస్ట్ ఇంధనంలా పనిచేస్తుంది. కాబట్టి దానిని స్కిప్ చేస్తే నష్టపోతారు. ఉదయం పూట తినకపోవడంవల్ల ఎనర్జీ లెవల్స్‌లో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. కొంచె నడిచినా, చిన్న పనిచేసినా అలసిపోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. హార్మోన్ల అసమతుల్యతకు దారితీయడం ద్వారా ఇతర సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.

* మానసిక స్థితిలో మార్పులు : ఎదిగే పిల్లలు, టీనేజర్లు బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే చాలా నష్టం. ఎందుకంటే ఉదయంపూట శరీరానికి తగిన పోషకాలు అందకపోతే అది మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక స్థితిలో మార్పులకు దారితీస్తుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. చదువులో, చేసే వర్క్‌లో వెనుకబడే అవకాశం ఉటుంది. హ్యూమన్ న్యూరోసైన్స్‌లో ఫ్రాంటియర్స్ స్టడీ ప్రకారం మానసిక స్థితిని నియంత్రించడంలో కీ రోల్ పోషించే న్యూరో ట్రాన్స్‌మిటర్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నప్పుడే చక్కగా పనిచేస్తుంది. స్కిప్ చేస్తే సరిగ్గా పనిచేయదు.

* బరువు పెరుగుతారు : కొందరు బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉంటారు. కానీ వాస్తవానికి ఇలా స్కిప్ చేయడంవల్లే అధిక బరువు పెరుగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.ఎందుకంటే టిఫిన్ చేయకపోవడం అనే అలవాటు భోజనం అతిగా తినడానికి, ఆకలి విషయంలో నియంత్రణ కోల్పోవడానికి దారితీస్తుందట. క్రమంగా జీవక్రియ రేటు తగ్గడంవల్ల బరువు మరింత పెరుగుతారు. అలా జరగకూడదంటే ఉదయంపూట కనీసం ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలి. అలా సాధ్యం కానప్పుడు ఒక యాపిల్ పండు, క్యారెట్ ముక్క, కీరదోస, జామకాయ వంటివి తీసుకున్నా బ్రేక్ ఫాస్ట్ కిందకే వస్తాయి. పైగా అవి శరీరానికి శక్తిని ఇస్తాయి. కాబట్టి సమస్య ఉండదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed