అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలిస్తే నెక్స్ట్ టైం పక్కా ఇలానే వండుతారు..

by Kavitha |
అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలిస్తే నెక్స్ట్ టైం పక్కా ఇలానే వండుతారు..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా చాలా మంది ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అన్నమే తింటారు. కానీ కొంతమంది మాత్రం ఉదయం టిఫిన్ చేసి రెండు పూటలు అన్నం తింటారు. అన్నం తినడం వల్ల మనకు శక్తి లభిస్తుంది. దాని వల్ల రోజంతా యాక్టీవ్‌గా ఉంటాము. కానీ అన్నాన్ని మితంగా తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీల వలన బరువు పెరుగుతారు. అయితే అన్నాన్ని కూడా వండే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. సాధారణంగా బియ్యం కడిగేసి.. స్టవ్‌పై పెట్టి అన్నం వండుతారు. అలా కాకుండా.. అన్నాన్ని వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ లెవల్స్ కంట్రోల్:

బియ్యాన్ని నానబెట్టి అన్నం తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేది ఒక్కసారిగా పెరగకుండా.. మెల్లిగా పెరుగుతాయి.

జీర్ణ సమస్యలకు చెక్:

బియ్యాన్ని నానబెట్టి వండటం వల్ల.. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నార్మల్ చక్కెరలుగా మారి తిన్న అన్నం సులువుగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు కూడా దూరం అవుతాయి.

పోషకాలు అందుతాయి:

నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే.. శరీరానికి కావల్సిన ఖనిజాలు, విటమిన్లు కూడా ఎక్కువగా అందుతాయి.

అన్నం విడివిడిగా ఉంటుంది:

నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే.. అన్నం మెత్తగా అవ్వకుండా పలుకుగా.. పలుకుగా ఉడుకుతుంది.

త్వరగా ఉడుకుతుంది:

నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే మీకు సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. నానబెట్టి అన్నం వండటం వల్ల అన్నం కూడా ఎక్కువ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed