మీ పిల్లలకు ఈ ఆహార పదార్థాలు పెట్టారంటే.. బ్రెయిన్ రాకెట్‌లా పని చేస్తుంది..

by Kavitha |   ( Updated:2024-05-05 15:05:40.0  )
మీ పిల్లలకు ఈ ఆహార పదార్థాలు పెట్టారంటే.. బ్రెయిన్ రాకెట్‌లా పని చేస్తుంది..
X

దిశ,ఫీచర్స్:నేటి బాలలే రేపటి భారత పౌరులు. సహజంగా పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. అయితే పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలకు, వారి ఫోకస్ పెరిగేందుకు కొన్ని రకాల ఆహారం అవసరం. ఆ ఆహారాన్ని అందించే విషయంలో తల్లి, తండ్రులే వారికి సహాయపడాలి. మరి ఎలాంటి ఫూడ్ అందించండం వల్ల వారి బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుందో ఇక్కడ చూద్దాం.

కోడి గుడ్లు:

కోడి గుడ్లు ఎంతో పౌష్టికారమైన ఆహారం. పిల్లలకు ప్రతి రోజూ ఓ ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వండి. ఇది తింటే వారి బ్రెయిన్ యాక్టీవ్‌ అయి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

బెర్రీలు:

పిల్లలు రోజు బెర్రీస్ తినడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

సీ ఫుడ్:

చేపల్లో విటమిన్ డి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు గ్రహణ శక్తి, మెమరీ కోల్పోకుండా చూస్తాయి. సాల్మన్, ట్యూనా, సార్డైన్ చేపల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది.

నారింజ:

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పిల్లల డైట్‌లో నారింజ పండ్లు ఉంటే వారి సాధారణ ఆరోగ్యంతో పాటు గ్రహణ శక్తి కూడా మెరుగుపడుతుంది. విటమిన్ సి వల్ల వారిలో ఏకాగ్రత, గ్రహణ శక్తి, మెమరీ, వేగంగా గుర్తించడం వంటివి జరుగుతాయి.

అంతే కాకుండా నట్స్, బ్రోకలి, ఆకు కూరలు తరచూ వారి డైట్‌లో యాడ్ చేస్తూ ఉంటే విటమిన్లు ఎ, కె, ఐరన్ అందుతాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. బ్రెయిన్ యాక్టీవ్‌గా, షార్ప్‌గా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ ఓ అరటి పండు కూడా ఇవ్వండి.

Read More...

30 ఏళ్లు దాటిన మగవారు జాగ్రత్త.. అవి తీసుకోకపోతే కష్టం..?

Advertisement

Next Story

Most Viewed