Tiredness : తరచుగా అలసిపోతున్నారా?.. కారణం అదేనేమో!

by Javid Pasha |   ( Updated:2024-08-13 07:16:40.0  )
Tiredness : తరచుగా అలసిపోతున్నారా?.. కారణం అదేనేమో!
X

దిశ, ఫీచర్స్: అప్పుడప్పుడూ అలసట సహజమే కానీ.. ఎప్పుడూ అదే జరిగితే అనుమానించాల్సిందే అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. పని ఒత్తిడి, నిద్రలేమి, ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ టెన్షన్స్ వంటివి ఎదుర్కొన్నప్పుడు ఇది వచ్చిపోవడం కామన్. అలాంటివేమీ లేకున్నా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే శరీరానికి అత్యవసర సమయంలో శక్తనిచ్చే విటమిన్లు, పోషకాల లోపం ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం ఉంటే.. నిరంతర అలసట వేధిస్తుందని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు.

నాడీ వ్యవస్థపై ప్రభావం

విటమిన్ బి 12 లోపం తీవ్రమైన అలసటతోపాటు నాడీ వ్యవస్థపై, మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. క్రమంగా రెడ్ బ్లడ్‌సెల్స్ కూడా తగ్గిపోతుంటాయి. దీంతో ఎనీమియా వంటి రక్తహీనత వ్యాధులు వస్తాయి. ఇక దీర్ఘకాలంపాటు బి12 విటమిన్ లోపం కొనసాగితే జ్ఞాపశక్తి తగ్గుతుంది. ఏజ్‌బార్ వ్యక్తుల్లో అయితే డెమెన్షియా తలెత్తుతుంది. మెడ, వెన్ను, నడు భాగంలోని ఎముకల్లో నొప్పి కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి.

ఏం చేయాలి?

మానసిక, శారీరక అలసట, చికాకు, కుంగుబాటు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అయి వైద్య నిపుణులను సంప్రదిస్తే తగిన పరిష్కారం సూచిస్తారు. అలాగే ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు, ముఖ్యంగా ప్లాంట్‌ బేస్డ్ ఫుడ్స్ వంటివి ఆహారంలో భాగంగా తరచుగా తీసుకుంటూ ఉండటంవల్ల కూడా విటమిన్ బి12 లోపాన్ని భర్తీ చేయవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story