- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ఏడాది రోజున ఇవి తింటే అదృష్టమంట..
దిశ, ఫీచర్స్ : పాత ఏడాదికి గుడ్ బై చెప్పి 2024 లోకి అడుగు పెట్టేశాం.. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కొంత మంది కుటుంబసభ్యులతో ఆలయాలకు వెళ్లి నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తే, మరికొంత మంది స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడతారు. అయితే కొత్త ఏడాది రోజున కొన్ని ఆహార పదార్థాలు తింటే అదృష్టం కలిసొస్తుందంటూ ప్రగాఢంగా నమ్ముతున్నారు. మరి ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దానిమ్మ పండు : గ్రీకుల సాంప్రదాయం ప్రకారం దానిమ్మ పండుని శ్రేయస్సు, అదృష్టం, సంతానోత్పత్తికి సంకేతంగా పరిగణిస్తారు. కొత్త సంవత్సరాన్ని దానిమ్మ గింజలను తింటూ ప్రారంభిస్తే అదృష్టం కలిసి వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.
చేపలు : కొత్త ఏడాది ప్రారంభం రోజున చేపలను తింటే అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది అనుకుంటారు. అందుకే శ్రేయస్సుకు చిహ్నంగా ఉండే చేపలను తింటూ తింటూ కొంతమంది నూతన సంవత్సరంలోకి అడుగు పెడతారు.
కేక్ లేదా డోనట్స్ : కేక్ లేదా డోనట్స్ ని తింటూ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తే లక్ కలిసొస్తుందని కొంత మంది నమ్మకం.
ద్రాక్ష : న్యూయర్ ని ద్రాక్ష పండ్లు తింటూ ప్రారంభిస్తే ప్రతి నెల అదృష్టం కలిసొస్తుందని స్పెయిన్, లాటిన్ అమెరికా దేశప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఆ రోజున 12 ద్రాక్ష పండ్లను తింటే ప్రేమించిన వ్యక్తులు దగ్గర అవుతారని అక్కడి ప్రజల నమ్మకం.