బ్రేక్‌ ఫాస్ట్‌గా పెసర మొలకలు తింటే బోలెడు బెనిఫిట్స్.. బరువు కూడా తగ్గుతారు

by Javid Pasha |
బ్రేక్‌ ఫాస్ట్‌గా పెసర మొలకలు తింటే బోలెడు బెనిఫిట్స్.. బరువు కూడా తగ్గుతారు
X

దిశ, ఫీచర్స్ : ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌లో మనం ఇడ్లి, వడ, దోశ, పూరి, ఊతప్ప, పెసరట్టు వంటివి తింటుంటాం. మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి కలిగే బెనిఫిట్సే వేరు. వాస్తవానికి మొలకలు చాలా రకాలు. వాటిలో పెసర్ల మొలకలు కూడా ఒకటి. వీటిలో అధికస్థాయి ప్రోటీన్ ఉంటుందట. కాబట్టి మొలకెత్తిన పెసర్లను డైట్‌లో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తుంటారు నిపుణులు.

పెరస మొలకల్లో విటమిన్ సి, కె పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పర్చడంలో సహాయపడతాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండటం మూలంగా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటంవల్ల అధిక బరువును, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. విటమిన్ ఎ, సి, సిలికా వంటి మూలకాల కారణంగా జుట్టు ఆరోగ్యానికి మంచిది. చర్మంలో నిగారింపు కూడా పెరుగుతుంది. కాబట్టి ఉదయంపూట పెసర మొలకలను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed